Nick Powell : నా యాక్షన్ సీన్స్ నచ్చి ప్రభాస్ ఇంకో సినిమా ఆఫర్ ఇచ్చారు

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ మాట్లాడుతూ.. ''మూడు సంవత్సరాల క్రితమే 'రాధేశ్యామ్' డైరెక్టర్ ని కలిసాను. ఆయన స్క్రిప్ట్ బాగా అర్థమయ్యేలా చెప్పారు. నాకు ఈ కథ బాగా........

Nick Powell : నా యాక్షన్ సీన్స్ నచ్చి ప్రభాస్ ఇంకో సినిమా ఆఫర్ ఇచ్చారు

Radheshyam (2)

Nick Powell :  ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరెక్కిన సినిమా ‘రాధేశ్యామ్’ సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కింది. ‘రాధేశ్యామ్’ సినిమాని మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. గతంలో ప్రమోషన్స్ చేయగా సినిమా వాయిదా పడటంతో మళ్ళీ మరోసారి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా ‘రాధేశ్యామ్’ సినిమా స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ హైదరాబాద్ కి రాగా ఈ సినిమా గురించి 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

ఈ ఇంటర్వ్యూలో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ మాట్లాడుతూ.. ”మూడు సంవత్సరాల క్రితమే ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ ని కలిసాను. ఆయన స్క్రిప్ట్ బాగా అర్థమయ్యేలా చెప్పారు. నాకు ఈ కథ బాగా నచ్చింది. రాధేశ్యామ్ సినిమాలో క్లైమాక్స్ సీన్స్ లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘రాధేశ్యామ్’ సినిమా క్లైమాక్స్ ని నెలల పాటు తీశాం. ఈ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ లో చాలా వాటర్ ట్యాంక్స్, ఎక్సప్లోజివ్స్ ఎక్కువగా వాడాము. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. సినిమా హాలీవుడ్ రేంజ్ లో వస్తుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుంది” అని తెలిపారు.

Nick Powell : ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి

ఇక ప్రభాస్ గురించి చెప్తూ..”ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ తర్వాత ఇంకో ప్రాజెక్టు కూడా చేస్తున్నాను. ప్రభాస్ కి సీన్స్ చెప్పడం చాలా ఈజీ. ప్రభాస్ ఎలాంటి సీన్ అయినా చాలా ఈజీగా అర్ధం చేసుకుంటాడు. ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ప్రభాస్ కి నా వర్క్ నచ్చి తన మరో సినిమాకి కూడా వర్క్ చేయమని అడిగాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘ప్రాజెక్టు K’కి వర్క్ చేస్తున్నాను” అని తెలిపారు.