Nidhhi Agerwal: 9 సినిమాలకి డబ్బింగ్.. నిధి జోరు మాములుగా లేదుగా!

యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ మొదటి సినిమాతోనే క్యూట్ లుక్స్‌‌‌‌‌తో కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ఆ తర్వాత అఖిల్..

Nidhhi Agerwal: 9 సినిమాలకి డబ్బింగ్.. నిధి జోరు మాములుగా లేదుగా!

Nidhhi Agerwal

Nidhhi Agerwal: యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ మొదటి సినిమాతోనే క్యూట్ లుక్స్‌‌‌‌‌తో కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ఆ తర్వాత అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో నటించిన నిధికి ఆశించిన స్థాయి సక్సెస్‌‌‌‌‌ను అందించలేకపోయాయి. అయితే డేరింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ అమ్మడికి సాలిడ్ సక్సెస్‌‌‌ను తెచ్చిపెట్టింది. మరోవైపు తమిళ, కన్నడ సినిమాలలో కూడా బిజీగా బిజీగా ఉంది.

Ketika Sharma:’రొమాంటిక్’ ట్రీట్.. కేతిక అందాలు అదరహో!

కాగా, ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం ఫుల్ జోరు మీదున్నట్టు కనిపిస్తోంది. అంతకు ముందు కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత యాక్టివ్ అవుతోంది. గత నాలుగు రోజులుగా ఇన్ స్టాగ్రాంలో నిధి రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఒకే సారి తొమ్మిది చిత్రాలకు డబ్బింగ్ చెబుతున్నట్టు నిధి ఇన్ స్టాలో పేర్కొంది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మీకోసం ఓ ప్రత్యేకమైన అప్డేట్ రాబోతోంది అంటూ బయటపెట్టిన ఈ వ్యవహారం ఇప్పుడు ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.

Amala Paul: బోల్డ్ లుక్‌తో అమలాపాల్.. బౌండరీస్ క్రాస్ చేసేస్తుందా?

ఎందుకంటే నిధి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కాగా మరొకటి సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా. ఇవి కాక తమిళంలో మరో మూడు సినిమాలు కూడా చేస్తుంది. అయితే.. అన్నీ కలిపినా ఐదు సినిమాలే కాగా హరిహర వీరమల్లు ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. మరి నిధి డబ్బింగ్ చెప్తున్నా తొమ్మిది సినిమాలు ఏంటోనని తెగ చర్చ జరుగుతుంది. నిధి తమిళంలో డబ్బింగ్ కూడా చెప్తుందా ఏంటి అని కామెంట్లు వినిపిస్తున్నాయి.