Niharika Konidela : విడాకులు తీసుకోబోతున్న మరో మెగా జంట.. నిజమేనా?
ఇటీవల కాలంలో సెలబ్రెటీస్ గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం కామన్ అయ్యిపోయింది. తాజాగా అలాంటి ఒక విషయమే మెగా అభిమానులను బాగా బాధిస్తుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్య..

Niharika Konidela and Chaitanya Jonnalagadda are getting divorced?
Niharika Konidela : ఇటీవల కాలంలో సెలబ్రెటీస్ గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం కామన్ అయ్యిపోయింది. వాళ్ళు విడిపోడానికి కారణం ఏంటనేది తెలియనప్పటికీ, ఆ సెలబ్రెటీస్ కి సంబంధించిన అభిమానులను మాత్రం ఆ విషయం చాలా బాధిస్తుంది. తాజాగా అలాంటి ఒక విషయమే మెగా అభిమానులను బాగా బాధిస్తుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్య 2020 డిసెంబర్ 9న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.
Niharika Konidela : టర్కీలో బికినీతో రచ్చ చేస్తున్న నిహారిక.. మరోసారి సోషల్ మీడియాలో నిహారిక వైరల్..
వీరిద్దరి జంటని చూసి మెగాభిమానులు అంతా చూడముచ్చటగా ఉంది అంటూ సంబర పడ్డారు. కానీ వారి ఆనందం ఎక్కువ కాలం లేదు. వీరిద్దరి పెళ్లి అయిన ఏడాదిన్నరకే విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ తరువాత నిహారికాని ట్యాగ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో చైతన్య ఒక పోస్ట్ వేయడంతో అవి నిజం కాదని తేలిపోయింది. కానీ రీసెంట్ గా వీరిద్దరి చేసిన ఒక పని మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. నిహారిక అండ్ చైతన్య ఇన్‌స్టాగ్రామ్ లో ఒకరిని ఒకరు అన్‌ఫాలో కొట్టారు.
Niharika Konidela : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నిహారిక.. కారణం ఏంటి??
చైతన్య మెగా ఫ్యామిలీలో అందర్నీ ఫాలో అవుతూ, కేవలం నిహారికను మాత్రమే అన్‌ఫాలో కొట్టాడు. అంతేకాదు తమ పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో ఉన్న అన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు మళ్ళీ చర్చకు వచ్చాయి. మరి వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారా? లేదా? అనేది క్లారిటీ రావాలి. కాగా మరో మెగా డాటర్ శ్రీజ కొణెదల, కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కూడా విడిపోయారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా విడివిడిగానే ఉంటున్నట్లు సమాచారం. దీని పై కూడా ఎటువంటి క్లారిటీ లేదు.