పెళ్లి కూతురిగా మారిన మెగా ప్రిన్సెస్..

  • Published By: sekhar ,Published On : August 13, 2020 / 12:06 PM IST
పెళ్లి కూతురిగా మారిన మెగా ప్రిన్సెస్..

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి వివాహం జరుగబోతోంది. త్వరలో వీరి నిశ్చితార్థం జరుగనుంది. అయితే ఆ కార్యక్రమానికి ముందుగానే నిహారిక పెళ్లి కూతురిగా మారింది.

తండ్రి నాగబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టీవీ కార్యక్రమం కోసం నిహారిక పెళ్లి కూతురి గెటప్‌లోకి మారిపోయింది. ఓ ఛానెల్‌లో ‘బాపు బొమ్మకు పెళ్లంట’ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

వినాయక చవితి సందర్భంగా టెలికాస్ట్ కానున్న స్పెషల్ ఎపిసోడ్‌లో నిహారిక పాల్గొంది. ‘Wedding Vibes of Mega Princess Niharika Konidela’ అంటూ నిహారికను హైలెట్ చేస్తూ కట్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో నిహారిక పెళ్లి విశేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని ప్రోగ్రాం చాలా ఆహ్లాదకరంగా జరిగిందని సమాచారం.