నిహారిక మ్యారేజ్ : చిరు ఫ్యామిలీ స్టెప్పులు

  • Published By: madhu ,Published On : December 9, 2020 / 08:04 AM IST
నిహారిక మ్యారేజ్ : చిరు ఫ్యామిలీ స్టెప్పులు

Niharika Marriage : మెగా డాటర్‌ నిహారిక మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 2020, డిసెంబర్ 09వ తేదీ బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక వివాహం జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్‌లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకోబోతోంది నిహారిక. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా అక్కడకు చేరుకుని ప్రీ వెడ్డింగ్ సందడి మొదలుపెట్టేసింది. అతిథులు కూడా ఉదయ్‌పూర్ చేరుకున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు వివాహానికి హాజరు అవుతున్నారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్‌లో ఉదయ్ పూర్ చేరుకోగా.. అతని రాకతో మెగా ఫ్యామిలీలో మరింత జోష్ పెరిగింది. పవన్‌కు కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. పెళ్లికి టైమ్‌ దగ్గర పడుతుండటంతో.. మెగా ఫ్యామిలీలో పెళ్లి వేడుకలు హుషారుగా సాగుతున్నాయి.

మంగళవారం సాయంత్రం నుంచి నిహారిక మెహందీ పార్టీ వేడుకగా జరిగింది. ఉదయ్ పూర్‌లో వెడ్డింగ్‌కు ముందు నిర్వహించిన మెహందీ పార్టీలో సెలబ్రిటీలు హంగామా చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. వీరికి తోడు అల్లు ఫ్యామిలీ కూడా జతవ్వడంతో సందడే సందడి అన్నట్లు సాగుతోంది నిహారిక పెళ్లి వేడుక.