Niharika : నిర్మాతగా మెగా డాటర్.. ఓటిటిలో సినిమా

ఇప్పటిదాకా వెబ్ సిరీస్ లు నిర్మించిన నిహారిక అదే యూట్యూబ్ ఛానల్ నేమ్ పింక్ ఎలిఫాంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తుంది. నిన్న నాగబాబు బర్త్ డే సందర్భంగా

Niharika : నిర్మాతగా మెగా డాటర్.. ఓటిటిలో సినిమా

Niharika

Niharika :  మెగా డాటర్ నిహారిక చాలా యాక్టీవ్ పర్సన్ అని మన అందరికి తెలుసు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆర్టిస్ట్ గా మారింది. హీరోయిన్ గా మరి కొన్ని సినిమాలు కూడా నటించింది. నటన పరంగా మంచి మార్కులు పడ్డా కమర్షియల్ గా ఆ సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో హీరోయిన్ గా దూరమైంది నిహారిక. ఆ తర్వాత పెళ్లి చేసేసుకుంది.

Aryan Bail : షారుఖ్ తనయుడి బెయిల్ కోసం బాధ్యత వహించిన బాలీవుడ్ హీరోయిన్

అయితే నిహారిక ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండే నిర్మాతగా కూడా మారింది. యూట్యూబ్ లో పింక్ ఎలిఫాంట్ అనే ఛానల్ స్టార్ట్ చేసి అందులో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించడం మొదలు పెట్టింది. తాను కూడా అందులో నటించేది. కరోనా సమయంలో థియేటర్స్ లేకపోవడంతో ఓటిటి బాగా క్లిక్ అయింది. దీంతో చిన్న బడ్జెట్ సినిమాలన్నీ ఓటిటి బాట పట్టాయి. తాజాగా నిహారిక కూడా చిన్న బడ్జెట్ సినిమాలని నిర్మించి ఓటిటిలో రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.

Bigg Boss 5 : వరస్ట్ పర్ఫార్మర్‌గా సన్నీ.. జైలుకి పంపిన బిగ్ బాస్

ఇప్పటిదాకా వెబ్ సిరీస్ లు నిర్మించిన నిహారిక అదే యూట్యూబ్ ఛానల్ నేమ్ పింక్ ఎలిఫాంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తుంది. నిన్న నాగబాబు బర్త్ డే సందర్భంగా తన మొదటి సినిమాని అనౌన్స్ చేసింది. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ హీరోగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే సినిమాని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్న విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా నవంబర్ 19న జీ5 లో విడుదల కానుంది. నిర్మాతగా మెగా డాటర్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి మరి.