అరవకండి.. ఓటేయండి.. సీఎం కాదు.. పీఎం కూడా అవుతాడు

అరవకండి.. ఓటేయండి.. సీఎం కాదు.. పీఎం కూడా అవుతాడు

అరవకండి.. ఓటేయండి.. సీఎం కాదు.. పీఎం కూడా అవుతాడు

ఒక్క చిరంజీవి తప్ప మెగా కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతు ప్రకటించేశారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు కూడా నర్సాపురం ఎంపీ టిక్కెట్‌ను పవన్ కల్యాణ్ కేటాయించారు. మెగా డాటర్ నిహారిక తాజాగా జనసేనకు మద్దతు ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Read Also : నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ : వైసీపీలోకి శివాజీరాజా!

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ సూర్యకాంతం’ చిత్రం మార్చి 29 న విడుదలకు సిద్దం అయింది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా నిహారిక ప్రచారం చేసేందుకు ఏపీలోని ఒక కాలేజ్‌కు వెళ్లింది. అక్కడ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నిహారిక మాట్లాడుతుండగా.. సీఎం పవన్ కళ్యాణ్.. సీఎం పవన్ కళ్యాణ్.. అంటూ అభిమానులు అరవడం మొదలెట్టారు. 

ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన నిహారిక.. సీఎం సీఎం అని అరిస్తే సీఎం కారని, ఓటు వేస్తే సీఎం కాదు.. పీఎం కూడా అవుతాడు అంటూ నిహరిక అభిమానులను ఉద్దేశించి చెప్పింది. ఇదే సంధర్భంగా పవన్ కల్యాణ్ సినిమా నుంచి డైలాగ్‌ను వినిపించింది. అయితే ఆంధ్రలో తనకు ఓటు లేదని తన ఓటును కూడా అభిమానులే జనసేనకు వెయ్యాలంటూ పిలుపునిచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న’ సూర్యకాంతం’ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
Read Also : జేడీని చూడగానే జగన్ కు దడ.. వైసీపీ కబ్జాల నుంచి ఆయన కాపలా : పవన్

×