Nijam with Smita : ‘నిజం విత్ స్మిత’ ఫస్ట్ ప్రోమో వచ్చేసింది.. మొదటి ఎపిసోడ్ గెస్ట్ చిరు..

ఒకప్పటి పాప్ సింగర్ స్మిత కొత్త టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 'నిజం విత్ స్మిత' అంటూ నిజాన్ని నిర్భయంగా బయటపెడుతాను అంటుంది స్మిత. తాజాగా ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ ఎపిసోడ్ ని టాలీవుడ్ నెంబర్ వన్ చిరంజీవితో మొదలు పెట్టబోతున్నారు. ఇక ఎపిసోడ్ లో..

Nijam with Smita : ‘నిజం విత్ స్మిత’ ఫస్ట్ ప్రోమో వచ్చేసింది.. మొదటి ఎపిసోడ్ గెస్ట్ చిరు..

Nijam with Smita chiranjeevi

Nijam with Smita : ఒకప్పటి పాప్ సింగర్ స్మిత కొత్త టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘నిజం విత్ స్మిత’ అంటూ నిజాన్ని నిర్భయంగా బయటపెడుతాను అంటుంది స్మిత. ఈ టాక్ షోని అనౌన్స్ చేస్తూ ఈ మధ్య ఒక ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఆ ప్రోమో చూస్తుంటే సినీ, రాజకీయ, క్రీడా, పబ్లిక్ సర్వెంట్స్.. ఇలా ప్రతి రంగానికి చెందిన వారు ఈ షోలో హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఈ షో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది. ఫిబ్రవరి 10 నుంచి ఈ టాక్ షో ప్రసారం కానున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో తెలియజేశారు.

Nijam with Smita : స్మిత కొత్త టాక్ షో.. ‘నిజం’ నిర్భయంగా..

తాజాగా ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ ఎపిసోడ్ ని టాలీవుడ్ నెంబర్ వన్ చిరంజీవితో మొదలు పెట్టబోతున్నారు. ఇక ఎపిసోడ్ లో చిరంజీవి జీవితంలో ఉన్న ఎన్నో తెలియని విషయాలను, నిజాలను స్మిత బయట పెట్టబోతోంది. ఈ క్రమంలోనే.. కాలేజీ టైంలో చిరు క్రష్ గురించి, రాజకీయంలో జరిగిన సంఘటనలు, అవమానాలు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి చిరంజీవిలా ఎదిగే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది అంటారా? అంటూ నెపోటిజం గురించి ప్రశ్నిస్తున్న ఈ టాక్ షో బోల్డ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

అలాగే చిరంజీవి కూడా సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో తన కులం ఏంటని అడిగేవారు అంటూ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 10న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. మరి ఈ షో ద్వారా చిరంజీవి జీవితంలో ఉన్న రహస్యాలను, నిజాలను స్మిత ఎంత వరకు బయట పెడుతుందో చూడాలి. కాగా ఈ షోకి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా హాజరు కాబోతున్నాడు. ఆ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ వెన్నుపోటు మరియు చంద్రబాబు రాజకీయ ప్రస్థానం గురించి స్మిత ప్రశ్నించనుంది.