Kartihkeya 2 : ఈ సారి కృష్ణుడి కోసం.. ద్వారకా నగరం ఏమైంది??.. అదరగొట్టిన కార్తికేయ 2 ట్రైలర్..

 యువ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా కార్తికేయకి సీక్వెల్ గా కార్తికేయ‌ 2 రెడీ చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు.........

Kartihkeya 2 : ఈ సారి కృష్ణుడి కోసం.. ద్వారకా నగరం ఏమైంది??.. అదరగొట్టిన కార్తికేయ 2 ట్రైలర్..

Karthikeya 2

Kartihkeya 2 :  యువ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా కార్తికేయకి సీక్వెల్ గా కార్తికేయ‌ 2 రెడీ చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ గతంలో హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన కార్తికేయ మోషన్ పోస్టర్ ఆసక్తి కలిగించింది. ఇందులోకి నిఖిల్ కి జంటగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి.

తాజాగా కార్తికేయ 2 ట్రైలర్ విడుదల చేయగా ఇందులోని అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ అందర్నీ ఆకట్టుకున్నాయి. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. కృష్ణుడు ఎవరు అంటూ ద్వారకా నగరం కోసం హీరో వెతుకుతున్నట్టు, ఇంకా దేనికోసమో హీరో అన్వేషిస్తున్నట్టు ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ లో అసలు కథ చెప్పకుండా జాగ్రత్త పడి కొన్ని అద్భుతమైన షాట్స్ తో సినిమాపై ఆసక్తి పెంచాడు దర్శకుడు.

Mega 154 : సంక్రాంతికి కలుద్దాం అంటున్న మెగాస్టార్.. బాబీ డైరెక్షన్‌లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..

కాలభైరవ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని. కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.