పెళ్లికి పార్టీలతో పనిలేదు – ఘనంగా నిఖిల్ గౌడ నిశ్చితార్థం

యువ నటుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం రేవతితో బెంగుళూరులో ఘనంగా జరిగింది..

  • Published By: sekhar ,Published On : February 10, 2020 / 12:01 PM IST
పెళ్లికి పార్టీలతో పనిలేదు – ఘనంగా నిఖిల్ గౌడ నిశ్చితార్థం

యువ నటుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం రేవతితో బెంగుళూరులో ఘనంగా జరిగింది..

మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు, యువ నటుడు నిఖిల్‌ గౌడ నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా జరిగింది. దీనికి జనతాదళ్ (ఎస్) పార్టీ నేతలతో పాటు నిఖిల్‌ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్లో నిఖిల్‌, రేవతిల నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది.

రేవతి, కాంగ్రెస్ లీడర్ ఎమ్.కృష్ణప్ప బంధువు కావడం విశేషం. ఈ వేడుకకు ఇతర పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాదిమంది అతిథులు, బంధువులు మధ్య నిఖిల్‌, రేవతిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

NIKHIL

పెళ్లికి కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. నిఖిల్‌ తెలుగుచిత్ర సీమకు కూడా సుపరిచితుడే. నాలుగేళ్ల  క్రితం ‘జాగ్వార్‌’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. తదనంతర కాలంలో కర్ణాటక  ఎన్నికలలో మండ్యా లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి అయిన సమలతా అంబరీష్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఎన్నికల అనంతరం సినిమాలపైన దృష్టిపెట్టిన నిఖిల్‌ ఇప్పుడు పెళ్లితో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాడు. ఇటీవలే ‘కురుక్షేత్ర’ వంటి హిస్టారికల్ మూవీలో అభిమన్యుడిగా అలరించిన నిఖిల్ కన్నడలో ప్రస్తుతం ఎస్.కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 

NIKHIL