Nikhil SPY : స్పై మూవీ నుంచి నిఖిల్ అఫీషియల్ లీక్..

గత ఏడాది కార్తికేయ-2 సినిమాతో అనుకోని రీతిలో విజయాన్ని అందుకున్నాడు నిఖిల్. ఈ టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ తన కొత్త సినిమా నుంచి ఒక ఫోటోని అఫీషియల్ లీక్ చేశాడు.

Nikhil SPY : స్పై మూవీ నుంచి నిఖిల్ అఫీషియల్ లీక్..

Nikhil SPY

Nikhil SPY : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ తన కొత్త సినిమా నుంచి ఒక ఫోటోని అఫీషియల్ లీక్ చేశాడు. గత ఏడాది కార్తికేయ-2 సినిమాతో అనుకోని రీతిలో విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో. గతంలో తాను నటించిన సూపర్ హిట్ మూవీ కార్తికేయకి ఈ చిత్రం సీక్వెల్ గా తెరకెక్కింది. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ మూవీతో నిఖిల్ కి పాన్ ఇండియా మార్కెట్ కూడా క్రియేట్ అయ్యింది. దీంతో ఈ హీరో తదుపరి సినిమాలు పై భారీ హైప్ నెలకుంది.

Nikhil Siddhartha : నా లైఫ్‌లో ఆ క్యారెక్టర్స్‌ని నేను ఎప్పటికి మర్చిపోలేను.. నిఖిల్!

అయితే ఈసారి కార్తికేయ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, స్పై యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ‘స్పై’ అనే టైటిల్ పెట్టుకున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. కాగా ఇప్పుడు హీరో నిఖిల్ ఈ సినిమా నుంచి ఒక విషయం లీక్ చేశాడు. మూవీలోని ఒక వర్కింగ్ స్టిల్ ని షేర్ చేస్తూ.. నేషనల్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది సమ్మర్ కి అన్ని లాంగ్వేజ్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నట్లు తెలియజేశాడు. లీక్ చేసిన ఫొటోలో నిఖిల్ లుక్ ఆకట్టుకుంటుంది.

క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ‘గర్రి బిహెచ్’ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి ఎడిటర్ గా కూడా తానే పని చేస్తున్నాడు. గత ఏడాది ఒక మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ గ్లింప్స్ మూవీ పై అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ మూవీలో నిఖిల్ కి జోడిగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. శ్రీచరణ్ పకల సంగీతం అందిస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పథకం పై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.