Virata Parvam: విరాటపర్వం రివ్యూ ఇచ్చిన నిఖిల్.. ఎలా ఉందంటే?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ‘విరాటపర్వం’ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా, రిలీజ్ మాత్రం కాలేదు...

Virata Parvam: విరాటపర్వం రివ్యూ ఇచ్చిన నిఖిల్.. ఎలా ఉందంటే?

Nikhil Review On Virata Parvam

Virata Parvam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ‘విరాటపర్వం’ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా, రిలీజ్ మాత్రం కాలేదు. కరోనా కాలంలో రిలీజ్‌ను పలుమార్లు వాయిదా వేసుకున్న ఈ సినిమా, ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లో మనముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. తెలంగాణలో 90ల కాలం నాటి కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.

Virata Parvam: విరాటపర్వం.. ఇది అందరూ మెచ్చే ప్రేమకావ్యం!

ఇక జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమైన చిత్ర యూనిట్, ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. కాగా.. ఈ సినిమాపై మరో యంగ్ హీరో నిఖిల్ తాజాగా తన రివ్యూను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. విరాటపర్వం స్పెషల్ స్క్రీనింగ్ చూసిన నిఖిల్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి సినిమాను అందించిన దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాత సుధాకర్ చెరుకూరిలకు హ్యాట్సాఫ్ చెప్పాడు. విరాటపర్వం చిత్రం ఓ ఎపిక్ లవ్ స్టోరీ అని.. ఈ సినిమా చూసి తాను ఆశ్చర్యానికి లోనయ్యానని.. సాయి పల్లవి తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని.. రానా దగ్గుబాటి తన పాత్రలో అదరగొట్టాడని.. ఇలాంటి సినిమాలను అస్సలు మిస్ కావద్దని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

Virata Parvam: నాగాదారిలో.. వెన్నెల ప్రేమ గెలుస్తుందా లేదా?

నక్సల్ నేపథ్యంలో వస్తున్న సినిమా అయినా.. ప్రేమ, భావోద్వాగాలు కీలక అంశాలుగా ఈ సినిమాను మరో లెవెల్‌లో నిలబెడతాయని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి స్టన్నింగ్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ సినిమాపై నిఖిల్ రివ్యూ ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాలంటే విరాటపర్వం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.