Nikhil Siddharth: మరోసారి ఆ డైరెక్టర్‌కే నిఖిల్ ఛాన్స్ ఇచ్చాడా..?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు సుధీర్ వర్మతో చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.

Nikhil Siddharth: మరోసారి ఆ డైరెక్టర్‌కే నిఖిల్ ఛాన్స్ ఇచ్చాడా..?

Nikhil Siddharth Gives Chance To This Director Again

Nikhil Siddharth: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పై’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నిఖిల్ ఓ స్పై ఏజెంట్‌గా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద నిఖిల్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

Nikhil Siddhartha : కార్తికేయ 2తో నేషనల్ లెవల్లో మరో అవార్డు అందుకున్న నిఖిల్

కాగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని నిఖిల్ ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా సినీ వర్గాల్లో ఈ అంశంపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. నిఖిల్ తన నెక్ట్స్ మూవీని ఓ క్రేజీ డైరెక్టర్‌తో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో నిఖిల్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో స్వామి రారా, కేశవ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి.

Nikhil Siddhartha : నిఖిల్‌కి ఐకానిక్ గోల్డ్ అవార్డ్.. ‘నేషనల్ లెవెల్ బిగ్ స్టార్’ అంటున్న బాలీవుడ్ మీడియా..

ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుందనే వార్తతో ప్రేక్షకుల్లో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక ఈ సారి వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఏదేమైనా నిఖిల్ తన నెక్ట్స్ మూవీని సుధీర్ వర్మతో చేస్తే, ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.