Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక స్లో అయ్యాడు. కెరీర్ తొలినాళ్లలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని స్పీడుమీదున్న ఈ హీరో....

Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!

Nikhil Siddharth Spy Movie Shoot In Full Swing

Nikhil: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక స్లో అయ్యాడు. కెరీర్ తొలినాళ్లలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని స్పీడుమీదున్న ఈ హీరో, అర్జున్ సురవరం తరువాత ఇప్పటివరకు ఏ సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. అంతకు ముందు ఆయన నటించిన కిర్రాక్ పార్టీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఈ హీరో.

Nikhil Siddharth: కెరీర్ గ్రాఫ్‌లో డౌన్ ఫాల్.. నిఖిల్ ఆశలన్నీ ఈ రెండు సినిమాలే!

ఇక నిఖిల్ ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అతడి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ-2, 18 పేజీస్, స్పై చిత్రాలను నిఖిల్ ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూడింటిలో కార్తికేయ-2, 18 పేజీస్ రిలీజ్‌కు రెడీ కాగా, అతడి కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘స్పై’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తిగా థ్రిల్లర్ మూవీగా రానుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడుగా జరుగుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Nikhil Siddharth: స్పై థ్రిల్లర్ మూవీతో వస్తున్న నిఖిల్ సిద్ధార్థ్

ఈ సినిమాను దర్శకుడు గ్యారీ బిహెచ్ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ విటేకర్ ఈ సినిమాకు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నిఖిల్ సరసన అందాల భామ ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.