Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..? | Nikhil To Do It For First Time For Karthikeya 2

Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెట్టి ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్నాడు. మంచి సక్సెస్ ట్రాక్ రికార్డు ఉన్న ఈ కుర్ర హీరో, అర్జున్ సురవరం తరువాత...

Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?

Nikhil: యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెట్టి ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్నాడు. మంచి సక్సెస్ ట్రాక్ రికార్డు ఉన్న ఈ కుర్ర హీరో, అర్జున్ సురవరం తరువాత తన నెక్ట్స్ మూవీని ఇంకా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. దీంతో ఈ హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ-2 మూవీని రెడీ చేస్తున్నాడు నిఖిల్.

Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!

ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ సినిమా కోసం నిఖిల్ తొలిసారి ఓ డేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కార్తికేయ హిందీ డబ్బింగ్ చిత్రానికి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు కార్తికేయ-2 సినిమాను హిందీలోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక నిఖిల్ స్వయంగా హిందీలో డబ్బింగ్ చేప్పబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Nikhil: సీక్రెట్ రివీల్ చేసేందుకు కార్తికేయ డేట్ ఫిక్స్ చేశాడు!

ఒకవేళ ఇది నిజమైతే కార్తికేయ హిందీ ఫ్యాన్స్‌కు ఇది పండగే అని చెప్పాలి. థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా ఉండటమే ఈ సినిమాకు బలంగా మారనుండటంతో, దర్శకుడు చందూ ముండేటి ఈసారి కూడా సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను పట్టుకొస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నిఖిల్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ సినిమాను జూలై 22న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

×