Beautiful.. InSide..: కరోనా కాల్సెంటర్లో పనిచేస్తున్న హీరోయిన్
శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ని ఉద్ధేశిస్తూ.. ఓ డైలాగ్ ఉంటుంది… ‘You are Beautiful.. Inside’ అని, ఆ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది ఈ హీరోయిన్‌కి.. దక్షిణాదిలో తమిళ, మళయాలంతో పాటు తెలుగులో ‘గాయత్రి’, ‘మేడమీద అబ్బాయి’ సినిమాల్లో నటించింది నిఖిలా విమల్. సామాజిక కార్యక్రమాలంటే ఎప్పుడూ ముందు ఉండే నిఖిలా.. కరోనా కాలంలో కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి తనవంతు సహాయం అందిస్తుంది.
కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు విస్తరిస్తుండగా.. వీటిని అరికట్టడానికి కేంద్రం మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ కారణంగా పేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టాయి. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సహాయంగా విరాళాలు అందజేస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ నటులు, సెలబ్రిటీలు కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలకు వివిధ రూపాల్లో సహాయం చేస్తుండగా నిఖిలా.. నిత్యావసరవస్తువులు, మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం కేరళ ప్రభుత్వం కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయగా.. అందులో పనిచేస్తూ.. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తోంది.
హీరోయినే వాలంటీర్‌గా పనిచేసేందుకు ముందుకు రావడంతో ఆ రాష్ట్రంలో చాలా మంది అమ్మాయిలు మేం కుడా వాలంటీర్స్‌గా వర్క్ చేస్తామని ముందుకొస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ది ప్రీస్ట్’, జాకబ్ గ్రెగోరి ‘మణిరైలే అశోకన్’, సిబి సత్యరాజ్ ‘రంగ’ సినిమాల్లో నటిస్తోంది నిఖిలా.