నిఖిల్‌పై అల్లు అర్హ క్లాప్ – 18 పేజీస్ ప్రారంభం

నిఖిల్ హీరోగా అల్లు అరవింద్, సుకుమార్ కలయికలో ‘18 పేజీస్’ ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : March 5, 2020 / 10:00 AM IST
నిఖిల్‌పై అల్లు అర్హ క్లాప్ – 18 పేజీస్ ప్రారంభం

నిఖిల్ హీరోగా అల్లు అరవింద్, సుకుమార్ కలయికలో ‘18 పేజీస్’ ప్రారంభం..

‘అర్జున్ సురవరం’ చిత్రంతో తిరిగి ఫామ్‌‌లోకి వచ్చిన  నిఖిల్‌, బ‌న్నివాసు కాంబినేష‌న్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్ సంయుక్త నిర్మాణంలో బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. ‘18 పేజీస్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘రంగ‌స్థ‌లం’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన సుకుమార్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్‌ని తీసుకుని మ్యూజిక‌ల్ యూత్ ఫిల్మ్‌గా ‘కుమారి 21ఎఫ్’ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. “18 పేజీలు” చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అల్లు అర‌వింద్ దంపతులు పూజాకార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె బేబి అల్లు అర్హ హీరో నిఖిల్ మీద క్లాప్ నివ్వ‌గా.. నిర్మాత బ‌న్నీవాసు కుమార్తె బేబి హ‌న్విక‌ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. క్రియేటివ్ ద‌ర్శ‌కుడు సుకుమార్ మెద‌టి షాట్‌కి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

See Also | పొలిటికల్ బ్యాగ్రౌండ్‌తోనే రుబాబు చేశారు – ఔలాగాళ్ల గురించి మాట్లాడను భయ్యా…

సాంకేతిక నిపుణులు..
జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్  రైటింగ్స్‌
స‌మ‌ర్ప‌ణ‌ – అల్లు అర‌వింద్ 
సంగీతం- గోపి సుంద‌ర్‌
కెమెరా- యువ‌రాజ్‌
ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
లైన్ ప్రోడ్యూస‌ర్‌- బాబు
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్‌- శ‌ర‌ణ్ రాప‌ర్తి & అశోక్ .బి
ప్రోడక్ష‌న్ కంట్రోల‌ర్‌- వై. వీర‌బాబు
కో-డైర‌క్ట‌ర్‌.. రాధా గోపాల్‌
నిర్మాత‌- బ‌న్నీ వాసు
ద‌ర్శ‌క‌త్వం- ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్‌
క‌థ‌,స్క్రీన్‌ప్లే- సుకుమార్‌.