Nikki Tamboli : నేను ఏడ్చినా, నవ్వినా ట్రోల్ చేస్తారు.. వాళ్లకి పనేం లేదు..

తాజాగా దీనిపై నిక్కీ తంబోలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నాకు సిద్ధూ మూసేవాలా సాంగ్స్, వర్క్ అంటే ఇష్టం. బిగ్‌బాస్‌ షోలో ఉన్నప్పుడు కూడా నేను అతడి గురించి మాట్లాడాను. మేము గతంలో.........

Nikki Tamboli : నేను ఏడ్చినా, నవ్వినా ట్రోల్ చేస్తారు.. వాళ్లకి పనేం లేదు..

Nikki Tamboli

Nikki Tamboli :  ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘తిప్పరా మీసం’, ‘కాంచన 3’ లాంటి సినిమాలతో తెలుగులో మెప్పించిన నిక్కీ తంబోలి హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ లో కంటెస్టెంట్‌గా పాల్గొని అక్కడ కూడా ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖ రియాలిటీ గేమ్‌ షో ఖత్రోన్ కే ఖిలాడీ షోలో కూడా నిక్కీ పాల్గొంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనని ట్రోల్ చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని దాని గురించి మాట్లాడింది.

ఇటీవల పంజాబ్ సింగర్‌ సిద్ధూ మూసేవాలా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ కార్యక్రమంలో సిద్ధూ మృతిని తట్టుకోలేక ఏడ్చేసింది నిక్కీ తంబోలి. నిక్కీ ఏడ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కాగా చాలా మంది అది దొంగ ఏడుపని, జస్ట్‌ యాక్టింగ్‌ చేస్తోందని ట్రోల్‌ చేశారు. ఆ తర్వాత నిక్కీ సొంత సోదరుడు చనిపోయినప్పుడు ఆమె ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనడంతో షోలో నవ్వుతూ పాల్గొంది. దీంతో సొంత తమ్ముడు చనిపోయినా నవ్వుతుందని ట్రోల్ చేశారు.

 

Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్-1’ టీజర్‌ను వదిలిన మహేష్!

తాజాగా దీనిపై నిక్కీ తంబోలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నాకు సిద్ధూ మూసేవాలా సాంగ్స్, వర్క్ అంటే ఇష్టం. బిగ్‌బాస్‌ షోలో ఉన్నప్పుడు కూడా నేను అతడి గురించి మాట్లాడాను. మేము గతంలో కెనడాలో ఓసారి కలిశాము. ఆయన చనిపోయాడని తెలిసినప్పుడు ఎంతో బాధేసింది. అదే సమయంలో ఆయన గురించి అడిగేసరికి ఏడ్చేసాను. మనకి నచ్చినవాళ్లు చనిపోతే ఏడవటం సాధారణం. ఆ తర్వాత నా సొంత సోదరుడు చనిపోయిన సమయంలో నేను ఖత్రోన్‌ కె ఖిలాడీలో నవ్వుతూ కనిపించినందుకు ట్రోల్‌ చేశారు. ఇప్పుడు నేను మళ్ళీ ఏడ్చినా ట్రోల్‌ చేస్తారు. నవ్వినా, ఏడ్చినా ట్రోల్ చేయడమే వాళ్ళ పని. వాళ్ళకి ఇంకేం పని లేదు. ఆ విమర్శలు నన్నేం బాధపెట్టవు” అని తెలిపింది