ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్‌ఓవర్ మూవీగా నిశ్శబ్ధం

ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్‌ఓవర్ ఫిలింగా రూపొందుతున్న నిశ్శబ్ధం టీజర్‌ను సెప్టెంబర్‌లో విడుదల చెయ్యనున్నారు..

  • Edited By: sekhar , May 28, 2020 / 03:43 PM IST
ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్‌ఓవర్ మూవీగా నిశ్శబ్ధం

ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్‌ఓవర్ ఫిలింగా రూపొందుతున్న నిశ్శబ్ధం టీజర్‌ను సెప్టెంబర్‌లో విడుదల చెయ్యనున్నారు..

విలక్షణ నటుడు ఆర్.మాధవన్, అనుష్క జంటగా నటిస్తున్న సినిమా.. నిశ్శబ్ధం.. ఈ మూవీ కోసం రెండేళ్లు కష్ట పడి, రికార్డ్ టైమ్‌లో షూటింగ్ కంప్లీట్ చేశారు. నిశ్శబ్ధం.. ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్‌ఓవర్ ఫిలిం కావడం విశేషం.. (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలిసి వర్క్ చెయ్యడాన్ని క్రాస్ఓవర్ అంటారు). ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది.

నలుగురు ఇండియన్స్‌కి అమెరికా పోలీసులకు మధ్య జరిగే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. కిల్ బిల్ మూవీలో విలన్‌గా నటించిన మైఖేల్ మ్యూడిసన్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేశారు. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు నటించారు. సెప్టెంబర్‌లో టీజర్ రిలీజ్ కానుంది.

Read Also : దళపతి 64 సమ్మర్‌లో విడుదల..

డిసెంబర్ లేదా 2020 జనవరిలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చెయ్యనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై.. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి నిర్మించారు. భాగమతి తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో నిశ్శబ్ధంపై మంచి అంచనాలున్నాయి.