Nithiin: పక్కా మాస్ ట్రీట్‌గా ‘‘రా రా రెడ్డి..’’ సాంగ్!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా నుండి ‘రా రా రెడ్డి’....

Nithiin: పక్కా మాస్ ట్రీట్‌గా ‘‘రా రా రెడ్డి..’’ సాంగ్!

Nithiin Macherla Niyojakavargam Ra Ra Reddy Song Is Pakka Mass

Nithiin: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా నుండి ‘రా రా రెడ్డి’ అనే ఊరమాస్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ఓ ప్రోమో ద్వారా వెల్లడించింది. ఈ మాస్ మసాలా సాంగ్ ప్రోమోలో నితిన్‌తో పాటు అందాల భామ అంజలి అదిరిపోయే చిందులేస్తూ కనిపించింది. కాగా, తాజాగా ఈ పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!

నితిన్ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఈ పాట ఉండటం, మహతి స్వర సాగర్ బ్లాక్‌బస్టర్ ట్యూన్స్‌కు అంజలి అందాలు తోడవడంతో ఈ పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సింగర్ లిప్సిక పాడిన ఈ ఊరమాస్ పాట చివర్లో, నితిన్ మొదటి సినిమాలో హిట్ సాంగ్ ‘‘రాను రానంటూనే చిన్నదో..’’ అనే లైన్స్‌ను జోడించడంతో ఈ పాట మరింత హుషారుగా సాగింది. ఇక ఈ పాటలో అంజలి కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే స్టెప్స్ వేసింది.

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో చిల్ అవుతోన్న నితిన్

దీంతో ఈ పాట ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాట యూట్యూబ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా నితిన్ నుండి ఇలాంటి మాస్ సాంగ్ వచ్చి చాలా రోజులు కావడంతో ఈ పాట సినిమాకే హైలైట్‌గా ఉండటం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను దర్శకుడు ఎస్ఆర్.శేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 12న థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.