Nithiin: భార్యకు దూరంగా నితిన్.. అసలు కథ చెబుతానంటోన్న వెంకీ!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ సినిమా నితిన్ కెరీర్‌లో మరో ఫెయిల్యూర్ మూవీగా మిగిలింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని నితిన్ ఎవరితో చేస్తాడా అనేది సస్పెన్స్‌గా మారింది.

Nithiin: భార్యకు దూరంగా నితిన్.. అసలు కథ చెబుతానంటోన్న వెంకీ!

Nithiin Next Movie Based On Divorced Man With Venky Kudumula

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ సినిమా నితిన్ కెరీర్‌లో మరో ఫెయిల్యూర్ మూవీగా మిగిలింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని నితిన్ ఎవరితో చేస్తాడా అనేది సస్పెన్స్‌గా మారింది. కాగా, ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్టును రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీతో స్టార్ట్ చేశాడు ఈ యంగ్ హీరో. అయితే తనకు ‘భీష్మ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు వెంకీ కుడుములతో మరోసారి చేతులు కలిపేందుకు ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నాడట.

Nithiin : మారేడుమిల్లి అడవుల్లో మొదలైన నితిన్ కొత్త మూవీ..

అయితే నితిన్ తన భార్యకు దూరంగా ఉండబోతున్నాడని.. విడాకుల ఇచ్చిన తరువాత ఆయన జీవితం ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు చెప్పేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడట. నితన్ తన భార్యకు దూరంగా ఉండేది రియల్ లైఫ్‌లో కాదు.. కేవలం రీల్ లైఫ్‌లోనే. అవును.. వెంకీ కుడుముల తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం రాసుకున్న కథలో హీరో తన భార్య నుంచి విడాకులు తీసుకుని జీవితం గడుపుతాడని.. అతడి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలనే సినిమా కథలో చూపించబోతున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Nithiin: మాచర్ల ఎఫెక్ట్.. సైలెన్స్ వీడని నితిన్..?

కాగా, ఈ కథను చాలా ఫన్నీగా చూపించనున్నాడట ఈ దర్శకుడు. నితిన్‌కి కూడా ఈ కథ బాగా నచ్చడంతో ఆయన ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి, వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈసారి వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.