Nithiin: వెంకీ కోసం ప్రయోగం చేయబోతున్న నితిన్.. వర్కవుట్ అయ్యేనా..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లాస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు నితిన్. ఇప్పటికే తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేయాలా అనే విషయంపై ఓ క్లారిటీకి వచ్చేశాడు ఈ హీరో. గతంలో తనకు ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు వెంకీ కుడుములతో మరోసారి జతకట్టేందుకు రెడీ అయ్యాడు నితిన్.

Nithiin: వెంకీ కోసం ప్రయోగం చేయబోతున్న నితిన్.. వర్కవుట్ అయ్యేనా..?

Nithiin Next With Venky Kudumula To Have A Tragedy Ending

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లాస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు నితిన్. ఇప్పటికే తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేయాలా అనే విషయంపై ఓ క్లారిటీకి వచ్చేశాడు ఈ హీరో. గతంలో తనకు ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు వెంకీ కుడుములతో మరోసారి జతకట్టేందుకు రెడీ అయ్యాడు నితిన్.

Nithiin : స్టార్ హీరో నితిన్ చేతుల మీదుగా మణికొండలో ‘బాబాయ్ హోటల్’ ప్రారంభం..

అయితే ఈ సినిమా కంటే ముందుగా, వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు చాలా సమయం పడుతుండటంతో, నితిన్‌తో సినిమాకు రెడీ అయ్యాడు ఈ డైరెక్టర్. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్తతో అభిమానుల్లో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతుండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ ట్రాజెడీతో సాగనుందని తెలుస్తోంది.

Nithiin: భార్యకు దూరంగా నితిన్.. అసలు కథ చెబుతానంటోన్న వెంకీ!

ఈ సినిమా కోసం నితిన ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరో నెలరోజుల్లో చనిపోతానని తెలుసుకున్న హీరో, ఆ నెల రోజులు ఎలా గడిపాడనేది మనకు సినిమా కథగా చూపించబోతున్నారట. హీరో మరణవార్త గురించి తెలుసుకున్న అతడి చుట్టుపక్కల వారు, అతడితో ఎలా ప్రవర్తించారు.. చివరకు హీరో కథ ఎలా ముగిసిందనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇలాంటి ట్రాజెడీ కథలకు ఎలాంటి ఆదరణ దక్కుతుందనే విషయంపై చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా కథలో బలం ఉంటే, సినిమాలో ఎంత ట్రాజెడీ ఉన్నా, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని వారు నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు వారు రెడీ అవుతున్నారు.