Nithiin: అప్పుడు విక్రమ్.. ఇప్పుడు కబ్జా.. నితిన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అయితే నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. గతేడాది ఈ బ్యానర్‌పై స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

Nithiin: అప్పుడు విక్రమ్.. ఇప్పుడు కబ్జా.. నితిన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Nithiin Releasing Kabzaa In Telugu

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అయితే నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. గతేడాది ఈ బ్యానర్‌పై స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

Nithiin: వెంకీ కోసం ప్రయోగం చేయబోతున్న నితిన్.. వర్కవుట్ అయ్యేనా..?

ఇక విక్రమ్ సినిమా తరువాత మరో డబ్బింగ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు. ఈసారి కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ చిత్రాన్ని టాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు నితిన్ రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాను రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నట్లు హీరో నితిన్ ప్రకటించాడు. కబ్జా చిత్రంలో ఉపేంద్రతో పాటు మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Kabzaa : మార్చిలో థియేటర్ల ‘కబ్జా’కి సిద్దమైన ఉపేంద్ర..

కాగా, ఈ సినిమాలో అందాల భామ శ్రియా సరన్ ఓ కీలక పాత్రలో నటిస్తోండగా, ఈ చిత్రాన్ని ఆర్.చంద్రు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మార్చి 17న రిలీజ్ చేస్తుండగా, ఈ సినిమాకు కేజీయఫ్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి కబ్జా చిత్రంతో ఉపేంద్ర టాలీవుడ్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.