Macherla Niyojakavargam: ఐటెం సాంగ్.. బాలీవుడ్ భామను తీసుకొస్తున్న నితిన్

గత ఏడాది కరోనా ప్రభావంలో కూడా మూడు సినిమాలను తీసుకొచ్చిన హీరో నితిన్ ఒక్కడే. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత

Macherla Niyojakavargam: ఐటెం సాంగ్.. బాలీవుడ్ భామను తీసుకొస్తున్న నితిన్

Macherla Niyojakavargam

Macherla Niyojakavargam: గత ఏడాది కరోనా ప్రభావంలో కూడా మూడు సినిమాలను తీసుకొచ్చిన హీరో నితిన్ ఒక్కడే. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా గత ఏడాది వచ్చిన మాస్ట్రో, చెక్, రంగ్ దే సినిమాలు ఆశించిన సక్సెస్‌ ఇవ్వలేకపోయాయి. ఈసారి ఎలాగైనా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్న నితిన్ ఇప్పుడు ఓ పొల్టికల్ డ్రామాతో రాబోతున్నాడు. ఆ సినిమానే మాచర్ల నియోజిక వర్గం.

Nithin : ‘జూనియర్’గా నితిన్.. మరో సినిమా లైన్లో..

యంగ్ బ్యూటీ కృతిశెట్టి ఇందులో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. యాక్షన్ అంశాలతో పాటు ఎంటర్ టైన్మెంట్ ప్రదానంగా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. కాగా, ఇందులో ఓ క్రేజీ ఐటెం సాంగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. దీని కోసం బాలీవుడ్ భామను తీసుకొస్తున్నాడట నితిన్.

Nithin: హిందీ యూట్యూబ్ డబ్బింగ్ ఫిల్మ్స్.. ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్!

బాలీవుడ్ ఐటెం బాంబ్ గా, హాట్ గాళ్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఊర్వశి రౌతెలా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు సై అనిందని సమాచారం. హిందీలో సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ లాంటి చిత్రాలలో నటించి బాగా పాపులారిటీని సాధించుకున్న ఊర్వశి.. తెలుగులో ఎంట్రీ ఇచ్చి సంపత్ నంది పర్యవేక్షణలో బ్లాక్ రోజ్ అనే సినిమాను చేసింది. ఆ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సిఉండగా ఇప్పుడు మాచర్లలో ఐటెం సాంగ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తుంది.