న్యూ లుక్..భీష్ముడిగా నితిన్

10TV Telugu News

తాజాగా నితిన్‌ ‘సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ (ఎప్పటికీ ఒంటరిగా) అంటూ ఓ ప్రకటన ఇప్పించారు. ఇది చదివి  నితిన్‌ ఎప్పటికీ బ్యాచిలర్‌గా మిగిలిపోతాడేమో అని ఊహించుకోకండి. ఒంటరిగా ఉంటానని నితిన్‌ చెప్పింది ‘భీష్మ’ చిత్రం గురించి. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా రూపొందనున్న సినిమా ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా నితిన్ కు జోడిగా నటించనుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 

చాలా కాలంగా వార్తల్లో నానుతున్న ఈ సినిమా వస్తుందా? రాదా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే శుక్రవారం (మార్చి 29,2019)న నితన్ బర్త్ డే సందర్భంగా.. ఈ చిత్ర పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది చిత్రయూనిట్. భీష్మ- సింగిల్ ఫరెవర్ అనే కాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్‌లో నితిన్‌ పై మోడ్రన్స్ గర్ల్స్ సింబల్స్ ఉంచడం, సింగిల్ ఫరెవర్ అనే కాప్షన్‌ పెట్టడాన్ని బట్టి చూస్తే ఇదేదో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ అని అర్థమవుతోంది. అతిత్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

×