Sagar K Chandra : ఎట్టకేలకు భీమ్లానాయక్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా.. ఛాన్స్ ఇచ్చిన నితిన్..

ప్రస్తుతం నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో త్వరలో రానున్నాడు. ఆ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా పవన్‌కల్యాణ్‌తో ‘భీమ్లానాయక్‌’ తెరకెక్కించిన............

Sagar K Chandra : ఎట్టకేలకు భీమ్లానాయక్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా.. ఛాన్స్ ఇచ్చిన నితిన్..

Nithin

Nithin :  అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ప్రేక్షకులని మెప్పించిన సాగర్ చంద్ర చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది భీమ్లా నాయక్ సినిమాతో. భీమ్లా నాయక్ సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడు అయినా మొత్తం వెనకుండి నడిపించింది త్రివిక్రమ్ అని అంతా అనుకున్నారు. దీంతో సాగర్ చంద్రకి రావాల్సిన సగం క్రెడిట్ త్రివిక్రమ్ కి వెళ్ళిపోయింది.

భీమ్లా నాయక్ హిట్ అయినా కూడా సాగర్ చంద్రకి అంతగా పేరు రాలేదు, ఆ తర్వాత అవకాశాలు కూడా రాలేదు. ఇంత ట్యాలెంట్ ఉన్న దర్శకుడికి అవకాశాలు ఎందుకు రావట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఎట్టకేలకు సాగర్ చంద్రకి ఓ సినిమా వచ్చినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే నితిన్ సాగర్ చంద్రకి అవకాశం ఇచ్చాడు.

Nayan Vignesh : థాయిలాండ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నయన్-విగ్నేష్

ప్రస్తుతం నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో త్వరలో రానున్నాడు. ఆ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా పవన్‌కల్యాణ్‌తో ‘భీమ్లానాయక్‌’ తెరకెక్కించిన దర్శకుడు సాగర్‌ కె.చంద్ర వినిపించిన కథకి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాని అనౌన్స్ చేయనున్నారు.