వెంకీ.. ఈ స్క్రిప్ట్ నీదేనా? ఈ కథ నువ్వే రాశావా? – నాగశౌర్యకు నితిన్ పంచ్..

‘భీష్మ’ సక్సెస్ మీట్ - హీరో నాగశౌర్యకు పంచ్ వేసిన నితిన్..

10TV Telugu News

‘భీష్మ’ సక్సెస్ మీట్ – హీరో నాగశౌర్యకు పంచ్ వేసిన నితిన్..

‘భీష్మ’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నితిన్ ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఓ యంగ్ హీరోని ఉద్దేశించి వేసిన పంచ్ బాగా పేలింది. ఇప్పుడు ఫిలిం నగర్‌లోను, సాధారణ ప్రేక్షకుల్లోనూ నితిన్ వేసిన పంచ్ గురించే డిస్కషన్ నడుస్తోంది.

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీష్మ’ మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం హిట్ టాక్, మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. సినిమా చూసి పలువురు సినీ ప్రముఖులు ‘భీష్మ’ టీమ్‌ని అభినందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

 

ఈ ఆ కార్యక్రమంలో వెంకీ కుడుముల మాట్లాడిన అనంతరం మైక్ అందుకున్న నితిన్.. ‘ఈ స్క్రిప్ట్ నీదేనా? ఈ కథ నువ్వే రాశావా?’ అంటూ సెటైర్ వేశాడు. దీంతో అక్కడున్న వారందరూ నవ్వారు. హీరో నాగశౌర్యకు నితిన్ పంచ్ వేశాడంటూ అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ షురూ అయిపోయింది. 

‘ఛలో’ సినిమా కథ తనదేనని వెంకీ కుడుముల నమ్మక ద్రోహి అని, మా అమ్మ గిఫ్ట్ ఇచ్చిన కారుని వేరే వాళ్లకి ఇచ్చేశాడని, అతను తన స్నేహితుడే కాదని నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. శౌర్య వ్యాఖ్యలపై వెంకీ కుడుముల స్పందించడానికి నిరాకరించాడు.