Macherla Niyojakavargam: పూనకాలు తెప్పించేలా.. మాచర్లలో నితిన్ ఫస్ట్ అటాక్!

గత ఏడాది కరోనా ప్రభావంలో కూడా మూడు సినిమాలను తీసుకొచ్చిన హీరో నితిన్ ఒక్కడే. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా గత ఏడాది వచ్చిన మాస్ట్రో, చెక్, రంగ్ దే సినిమాలు ఆశించిన..

Macherla Niyojakavargam: పూనకాలు తెప్పించేలా.. మాచర్లలో నితిన్ ఫస్ట్ అటాక్!

Macherla Niyojakavargam

Macherla Niyojakavargam: గత ఏడాది కరోనా ప్రభావంలో కూడా మూడు సినిమాలను తీసుకొచ్చిన హీరో నితిన్ ఒక్కడే. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా గత ఏడాది వచ్చిన మాస్ట్రో, చెక్, రంగ్ దే సినిమాలు ఆశించిన సక్సెస్‌ ఇవ్వలేకపోయాయి. ఈసారి ఎలాగైనా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్న నితిన్ ఇప్పుడు ఓ పొల్టికల్ డ్రామాతో రాబోతున్నాడు. ఆ సినిమానే మాచర్ల నియోజిక వర్గం. యంగ్ బ్యూటీ కృతిశెట్టి, కేథరిన్‌ థ్రెస్సా ఇందులో నితిన్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Macherla Niyojakavargam: ఐటెం సాంగ్.. బాలీవుడ్ భామను తీసుకొస్తున్న నితిన్

ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. యాక్షన్ అంశాలతో పాటు ఎంటర్ టైన్మెంట్ ప్రదానంగా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. కాగా, మార్చి 26న `ఫస్ట్ ఛార్జ్` పేరుతో ఫస్ట్ లుక్‌ని విడుదల చేయగా ఆడియన్స్ ను ఎంగేజ్ చేసింది. ఈ చిత్రంలో నితిన్‌ ఎన్‌.సిద్ధార్థ్‌ రెడ్డిగా కనిపించబోతుండగా.. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నారని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. తాజాగా నితిన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేసి విషెష్ తెలిపింది.

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో చార్జ్ తీసుకున్న సిద్ధార్థ్ రెడ్డి

ఈ గ్లిమ్ప్స్ లో నితిన్ గతంలో ఏ సినిమాల్లో చూడని మాస్ ఫీస్ట్ చూపించారు. ఇందులో కనిపించే ప్రతి విజువల్ మంచి సాలిడ్ ఫీస్ట్ ఇచ్చేలా కట్ చేశారు. థియేటర్స్ లో ఈ పర్టిక్యులర్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మాస్ ఆడియెన్స్ కి డెఫినెట్ ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. మహతి స్వర సాగర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఎఫెక్టివ్ గా ఉండగా.. నితిన్ అభిమానులకి ఒక అదిరే ట్రీట్ గా కనిపిస్తుంది. నితిన్ కెరీర్‌లో 31వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.