Virataparvam : ప్రమోషన్స్ ఫుల్.. కలెక్షన్స్ నిల్.. సాయి పల్లవి క్రేజ్ కూడా పనికి రాలేదు..

ఆత్మీయ వేడుకలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రధాన పట్టణాల పర్యటనలు, చిట్ చాట్ లు, మీడియా క్యాంపెయిన్ లు ఒక్కటేమిటి చేయాల్సిన పబ్లిసిటీ అంతా చేసినా, జనాల్ని థియేటర్ల దగ్గరకు రప్పించలేక పోయింది విరాటపర్వం సినిమా..............

Virataparvam : ప్రమోషన్స్ ఫుల్.. కలెక్షన్స్ నిల్.. సాయి పల్లవి క్రేజ్ కూడా పనికి రాలేదు..

Virataparvam

Virataparvam :  ఆత్మీయ వేడుకలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రధాన పట్టణాల పర్యటనలు, చిట్ చాట్ లు, మీడియా క్యాంపెయిన్ లు ఒక్కటేమిటి చేయాల్సిన పబ్లిసిటీ అంతా చేసినా, జనాల్ని థియేటర్ల దగ్గరకు రప్పించలేక పోయింది విరాటపర్వం సినిమా. అసలే పాన్ ఇండియా ట్రెండ్ మరోవైపు యాక్షన్ సినిమాల హంగామాతో థియేటర్లు సందడి చేస్తుంటే, నక్సల్ బ్యాక్ డ్రాప్ లో, టిపికల్ లవ్ స్టోరీని చూపించారు వేణు ఊడుగుల.

ప్రమోషన్స్ విషయంలోనూ రాజీ పడలేదు విరాట పర్వం టీమ్. కర్నూల్, వరంగల్ లో ఆత్మీయ సభలు, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి, వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమా పైన అంచనాలు పెంచేశారు. ఈ ఈవెంట్స్ తోపాటు టీజర్ , ట్రయిలర్, సాంగ్స్ కి అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం థియేటర్లకి రావట్లేదు. సాయిపల్లవి వెన్నెల క్యారెక్టర్ లో ఎక్సట్రార్డినరీ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక రానా రవన్న పాత్రను అద్భుతంగా పండించాడు. సినిమాలో వినోదం అయితే ఉండదు కాని, ఎమోషన్ ఉంది. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లోనే ఉత్తమ సినిమా విరాటపర్వం అని రీసెంట్ గా తమిళ డైరెక్టర్ పా రంజిత్ కూడా ప్రశంసించాడు. సెలబ్రిటీస్ నుంచి ప్రశంసలు దక్కినా, కలెక్షన్లు ఎందుకు రావడం లేదు, లెక్క ఎక్కడ తప్పిందని వేళ్లు కొరుక్కుంటున్నారు దర్శక నిర్మాతలు.

Chinamayi Sripaada : కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి

ఆడియన్స్ ఇటీవల కామెడీ, యాక్షన్ సినిమాలకి, ఎలివేషన్స్ కి బాగా అలవాటు పడ్డారు. ఆలాంటి టైంలో నక్సల్స్ నేపథ్యంలో లవ్ స్టోరీ అంటే జనాలకి పెద్దగా ఎక్కలేదు. మ్యూజికల్ గా కూడా విరాటపర్వం అంత పెద్ద హిట్ కూడా కాదు. దీంతో ఈ సినిమాకి సాయి పల్లవి క్రేజ్ కూడా సరిపోయిలేదు కలెక్షన్స్ తీసుకురావడానికి. వారం రోజుల్లో కేవలం 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది. అంటే కేవలం 5 కోట్ల షేర్ కలెక్షన్స్ ని తీసుకొచ్చింది విరాట పర్వం. ఈ సినిమాకి 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 15 కోట్లు అయినా కలెక్ట్ చేయాలి. ప్రస్తుతం 10 కోట్ల లాస్ లో ఉంది సినిమా. సినిమా రిలీజ్ కి ముందు సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడం వల్ల అది కూడా సినిమాకి మైనస్ అయింది. దీంతో విరాటపర్వం బాగుంది అని టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం రావట్లేదు.