Bigg Boss 5: నో డౌట్ ఈరోజు పింకీ ఎలిమినేషన్ ఖాయం!

బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. మరో రెండు వారాలతో ఈ సీజన్ ముగియనుంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగలగా అందులో మరో రెండు వారాలతో విన్నర్ ఎవరో తేలిపోనుంది.

Bigg Boss 5: నో డౌట్ ఈరోజు పింకీ ఎలిమినేషన్ ఖాయం!

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. మరో రెండు వారాలతో ఈ సీజన్ ముగియనుంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగలగా అందులో మరో రెండు వారాలతో విన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే ఇప్పటి వరకు ఎలిమినేషన్ అయిన 12 మంది మాదిరే ఈ వారం ఇంట్లో నుండి మరొకరు ఎలిమినేట్ కావాల్సిఉంది. ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఆ కంటెస్టెంట్ ప్రియాంకా సింగ్ అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులలో చాలా క్లియర్ కనిపిస్తుంది.

NBK’s Unstoppable: మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్.. బాలయ్య షోలో మహేష్!

ట్రాన్స్ జెండర్ కేటగిరీ కింద ఇంట్లోకి వచ్చిన ప్రియాంకా సింగ్ ఇన్నాళ్లుగా ఇంట్లో ఉంటుందని ఆమెతో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా అసలు అంచనా వేయలేదు. ఇంట్లో మిగతా సభ్యులతో సామరస్యంతో పాటు కిచెన్ లో ప్రియాంకా వంటలు.. ఇతర సభ్యుల మీద ప్రియాంకా చూపిన ఇంట్రెస్ట్ ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నిజానికి ప్రియాంకా గత వారమే ఇంటి నుండి ఎలిమినేషన్ అవుతుందని అంచనా వేశారు. స్వయంగా ఆమె కూడా ఈ వారం నేను బయటకి వెళ్లడం ఖాయమని.. మిగతా సభ్యులతో చెప్పుకొని వీడ్కోలుకు సిద్ధమైంది.

Akhanda Bulls: అఖండకే హైలెట్ ఈ గిత్తలు.. కృష్ణార్జునుల ప్రత్యేకతలివే!

కానీ.. అనూహ్యంగా గత వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఎలిమినేట్ అయ్యాడు. అయితే.. ఈ వారం మాత్రం ప్రియాంకా వంతు వచ్చినట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న సభ్యులలో ప్రియాంక కాస్త వీక్ గా కనిపిస్తుంది. దానికి తోడు గత రెండు వారాలుగా పింకీ పర్ఫామెన్స్ కూడా ఏమంత గొప్పగా లేదు. గత వారం సొంతం వైద్యంతో శ్రీరామ్ కాళ్ళను మరింత ఇబ్బంది అయ్యేలా చేసి బిగ్ బాస్ కూడా ఆగ్రహం తెప్పించింది. ఇన్ని నెగటివ్ షేడ్స్ ఉండడంతోనే ఈ వారం పింకీ ఎలిమినేషన్ కావడం ఖాయమంటున్నారు. మరి ఈరోజు బిగ్ బాస్ ఎవరిని పంపిస్తాడో చూడాలి.