Maro Prasthanam: ఓన్లీ ఫర్ యాక్షన్ ఫిల్మ్ లవర్స్!

తనీష్ హీరోగా నటించిన కొత్త సినిమా మరో ప్రస్థానం. వన్ షాట్ ఫిల్మ్ గా ప్రచారం చేసుకున్న ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అటు లవ్ స్టోరి వంటి బిగ్ ఫిల్మ్ పోటీలో ఉన్నా..

10TV Telugu News

Maro Prasthanam: తనీష్ హీరోగా నటించిన కొత్త సినిమా మరో ప్రస్థానం. వన్ షాట్ ఫిల్మ్ గా ప్రచారం చేసుకున్న ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అటు లవ్ స్టోరి వంటి బిగ్ ఫిల్మ్ పోటీలో ఉన్నా.. తన ప్రత్యేకతను ట్రైలర్స్, మేకింగ్ వీడియోస్, పబ్లిసిటీ ద్వారా చూపిస్తూ పోటీలో తానూ ఉంటానని థియేటర్లలోకి వచ్చింది మరో ప్రస్థానం. ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీని దర్శకుడు జాని తెరకెక్కించగా.. హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది.

Love Story: ఇంటెన్స్ లవ్.. ఫీల్‌గుడ్ రొమాన్స్‌తో లవ్ స్టోరీ!

ముంబైలో వరుస నేరాలకు పాల్పడుతుంటుంది రాణె భాయ్ (కబీర్ దుహాన్ సింగ్) గ్యాంగ్. ఈ గ్యాంగ్ లో సభ్యుడు శివ (తనీష్). ఒక రోజు నైని (అర్చనా సింగ్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడగా.. నైని కూడా శివను ప్రేమిస్తుంది. అయితే, నైనిని పెళ్లి చేసుకుని తన క్రిమినల్ వృత్తిని వదిలేసి కొత్త జీవితం ప్రారంభిద్దామనుకుంటాడు. కానీ అంతలోనే తన జీవితంలో ఒక పెద్ద ట్రాజెడీకి లోనైన శివ…రాణె భాయ్ నేర సామ్రాజ్యాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటాడు. ఈ గ్యాంగ్ నేరాలను కెమెరాలో చిత్రీకరిస్తుంటాడు. రాణె భాయ్ చేయబోయే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. శివ జీవితంలో ఎదురైన ట్రాజెడీ ఏంటి, బాంబ్ బ్లాస్ట్ ఆపాలని అతను చేసిన ఈ ప్రయత్నాలు ఫలించాయా, ఈ కథలో యువిధ (ముస్కాన్ సేథి) పాత్ర ఏంటి, ఈ గ్యాంగ్ నేరాలను బయటపెట్టాలనుకున్న శివ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది మిగిలిన కథ.

Bigg Boss 5: ఎలిమినేషన్‌లో ఐదుగురు.. లహరికి డేంజర్ తప్పదా?

మరో ప్రస్థానం మూవీ మేకింగ్ పరంగా ఇన్నోవేటివ్ ప్రయత్నమే కాగా ఈ సినిమా ప్రారంభం నుంచీ ఎండ్ కార్డ్ వరకు కొత్త తరహాలో సాగుతుంది. దర్శకుడు జాని తను అనుకున్న పాయింట్ కు కట్టుబడి, తను తీయాలనుకున్న దారి మారకుండా మిగతా అన్ని అంశాలను వదిలేసి అనుకున్నదే తెరకెక్కించాడు. అందుకే దర్శకుడు అనుకున్న వన్ షాట్ ఫిల్మ్ మేకింగ్ లో కొన్ని చోట్ల సీన్స్ ల్యాగ్ అనిపించగా.. దర్శకుడు తాను అనుకున్న దారిలో వయలెన్స్ మోత మోగించాడు. హీరో తనీష్ ఇంతవరకు చేసిన సినిమాలలో ఇంత యాక్షన్, ఇంటెన్స్ క్యారెక్టర్ చేయలేదు. దర్శకుడు శివ ఏం చెప్పాడో తనీష్ తన పని తాను చేశాడు.

Big Boss 5: ప్రేమ కథలు, బ్రేకప్ స్టోరీలు.. ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్

ఇక సినిమా టెక్నీకల్ విషయాలకి వస్తే మేకింగ్ సైడ్ మిర్త్ మీడియా ప్రొడక్షన్ వ్యాల్సూస్ కనిపిస్తుండగా.. నాయికలు ముస్కాన్ సేథి సరదా అమ్మాయిగా.. గ్లామర్ ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తుంది. నైని క్యారెక్టర్ చేసిన అర్చనా సింగ్ బబ్లీ గర్ల్ గా ఒకే అనిపిస్తుంది. ఇక, రాణె భాయ్ గా కబీర్ సింగ్ దుహాన్ సెటిల్డ్ పర్మార్మెన్స్ చేస్తే సినిమాటోగ్రఫీతో పాటు సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాటలు సినిమాకు తగ్గట్లే ఉన్నాయి. సినిమాని ఓవరాల్ గా చూస్తే ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం పెద్ద మైనస్ కాగా.. యాక్షన్ లో వన్ షాట్ పాట్నర్ గా మరో ప్రస్థానం చిన్న సినిమా అయినా ఒక రేర్ మూవీగా చెప్పుకోవాలి. యాక్షన్.. యాక్షన్.. యాక్షన్ అనేలా ఓసారి చూద్దాం అంటే ఒకే..

×