NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..? | No Heroine Name In NTR30 Special Video

NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు కానుకగా తాను చేయబోయే రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా తారక్ పేరు మార్మోగిపోయింది....

NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు కానుకగా తాను చేయబోయే రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా తారక్ పేరు మార్మోగిపోయింది. ఇక తారక్ తన నెక్ట్స్ చిత్రాలను కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో చేయబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా అదరిపోయే రేంజ్‌లో ఉండటంతో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వారు అప్పుడే ఎదురుచూస్తున్నారు.

NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?

అయితే ఈ రెండు సినిమాల్లో ముందుగా తారక్, తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మెయిన్ ప్లాట్ ఏమిటో తెలియజేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను వదిలారు చిత్ర యూనిట్. ఈ వీడియోలో తారక్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చాయని చెప్పాలి. పవర్‌ఫుల్ కథతో ఈ సినిమా రాబోతుందనే విషయం అయితే స్సష్టం అయ్యింది. అయితే ఈ వీడియో గ్లింప్స్‌లో దర్శకుడు కొరటాల శివతో పాటు మరికొందరి పేర్లు కూడా కనిపించాయి. కానీ ఒక్కరి పేరు మాత్రం మిస్ అయ్యింది. అది మీరు గమనించారా?

NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!

ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వీడియోలో దర్శకుడు కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌ల పేర్లు మనకు కనిపించాయి. కానీ ఈ సినిమాలో తారక్ సరసన చేయబోయే హీరోయిన్ పేరు మాత్రం కనిపించలేదు. నిజానికి ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా బాలీవుడ్ భామ ఆలియా భట్‌ను తీసుకున్నారు చిత్ర యూనిట్. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడంతో, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి చిత్ర వర్గాలు.

×