Special Songs: ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా.. ఒక్క ఐటెం సాంగ్ కిక్కే వేరు!

ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్ అని స్టైల్ గా పిలుచుకునే ఐటమ్ సాంగ్. ఈమధ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చెయ్యడంతో సినిమా లుక్కే మారిపోతోంది.

Special Songs: ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా.. ఒక్క ఐటెం సాంగ్ కిక్కే వేరు!

Special Songs

Special Songs: ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్ అని స్టైల్ గా పిలుచుకునే ఐటమ్ సాంగ్. ఈమధ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చెయ్యడంతో సినిమా లుక్కే మారిపోతోంది. అంతే కాదు.. జనాలకు కూడా ఎక్స్ పెక్ట్ చేసినంత కిక్కిస్తోంది. ఎంత హీరో సెంట్రిక్ సబ్జెక్ట్ అయినా రాబోయే క్రేజీ సినిమాలన్నింటిలోనూ ఐటమ్ సాంగ్ కి మేకర్స్ స్పెషల్ స్పేస్ ఇస్తున్నారు.

Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్!

పక్కా మాస్ సినిమా కావొచ్చు.. కలిసొచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవొచ్చు. బిగ్ స్టార్ అయినా సరే.. యంగ్ హీరో అయినా కానీ ఈమధ్య మళ్లీ ఐటమ్ ట్రెండ్ షురూ అయింది. సినిమాకు హీరో, హీరోయిన్లతో పాటు.. స్పెషల్ సాంగ్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఐటమ్ సాంగ్స్ కు మళ్లీ గిరాకీ పెరగడంతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి కిక్కెక్కించే స్పెషల్ సాంగ్స్ తో సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

Tollywood Celebrations: ఇట్స్ పార్టీ టైమ్.. సెలబ్రేషన్ మూడ్‌లో టాలీవుడ్!

ఇప్పుడు ఐటమ్ అదే స్పెషల్ సాంగ్ కి ఓ లెక్కుంది. ఒకప్పటిలా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్స్ కాదు… స్టార్ డం అనుభవిస్తున్న వాళ్లు కూడా మాస్ సాంగ్ కి ఊ అంటున్నారు. ఊ ఊ చెప్పకుండా హ్యూజ్ రెమ్యునరేషన్ గ్లామర్ గర్ల్స్ కి ఆఫర్ చేస్తున్నారు మేకర్స్. అందులో పాట సూపర్ హిట్టయితే… లెవెల్ వేరే ఉంటుంది. అందుకే ఐటం సాంగ్స్ పై స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు గ్లామర్ డాల్స్.

Tollywood Directors: స్టార్స్‌తో సినిమాలు చేసినా.. పట్టాలెక్కని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!

గతంలో ఐటమ్ సాంగ్ చేయాలంటే వాటి కోసం స్పెషల్ గ్లామర్ గాళ్స్ ఉండేవారు. సిల్క్ స్మిత, జయమాలిని, అనురాధ లాంటి ఆర్టిస్టులు నటనతో పాటు స్పెషల్ గా ఐటెం సాంగ్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు బాగానే హీటెక్కించారు. ఆమధ్య ఐటమ్ ఉందంటే కొంతమంది మొహాలే గుర్తొచ్చేలా చక్రం తిప్పారు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. దీంతో హీరోయిన్స్ కాస్త ఐటెం భామలుగా మారిపోతున్నారు. బాలీవుడ్ లో ఫస్ట్ ఈ పద్ధతి మొదలైంది. టాప్ ఫాంలో ఉన్నప్పుడే కరీనా కపూర్, కత్రినా కైఫ్, దీపికా పదుకోన్ లాంటి హీరోయిన్స్ ఐటమ్ పాటలు చేసారు. ఇప్పుడున్న బాలీవుడ్ యంగ్ గర్ల్స్ కూడా హీరోయిన్ గా ట్రై చేస్తూనే.. ఛాన్స్ వస్తే స్పెషల్ నంబర్స్ చేసేస్తున్నారు.