Young Heroes: సక్సెస్ లేదు కానీ.. వరస సినిమాలను పట్టేస్తున్న లేత హీరోలు!

సక్సెస్ లు లేకపోయినా, హిట్లు లేకపోయినా.. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లుంటే చాలు.. సినిమాలు వాటంతట అవే తెరమీదకొస్తాయి. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. లైమ్ లైట్లో ఉన్న హీరోలు కూడా ఇన్ని..

Young Heroes: సక్సెస్ లేదు కానీ.. వరస సినిమాలను పట్టేస్తున్న లేత హీరోలు!

Young Heroes: సక్సెస్ లు లేకపోయినా, హిట్లు లేకపోయినా.. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లుంటే చాలు.. సినిమాలు వాటంతట అవే తెరమీదకొస్తాయి. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. లైమ్ లైట్లో ఉన్న హీరోలు కూడా ఇన్ని సినిమాలతో బిజీగా లేరు కానీ.. ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ హీరోలు మాత్రం వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఫ్లాపులు పలకరిస్తున్నా.. సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లు కొట్టేస్తున్నారు.

Young Heroes: కుర్రాళ్ళ యాక్షన్.. డిజాస్టరవుతున్న సినిమాలు!

సినిమా ఇండస్ట్రీలో సస్టెయిన్ అవ్వడం కోసం కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈయంగ్ హీరోలకు మాత్రం.. అసలు సక్సెస్ తో పనిలేదు. సినిమా తీసే ప్రొడ్యూసర్, చేసే డైరెక్టర్ ఉంటే చాలు.. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా సినిమా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. ఇలాగే మాస్ కా దాస్ విష్వక్ సేన్ తన సినిమాల రిజల్ట్ ని పక్కన పెట్టి వరసగా సినిమాలు చేస్తున్నాడు. పాగల్ సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేసిన విష్వక్.. లేటెస్ట్ గా దాస్ గా దమ్కీ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలతో పాటు అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది.

Telugu Young Heroes: కంటెంట్ చాలు.. కటౌట్ అవసరం లేదంటున్న చిన్న హీరోలు!

రాజావారు-రాణిగారు, ఎస్.ఆర్ కళ్యాణమండపంతో పర్వాలేదనిపించిన కిరణ్ అబ్బవరం.. మొన్నీమధ్య వచ్చిన సెబాస్టియన్ పిసి 524తో ఫ్లాప్ ఫేస్ చేశాడు. అయినా సరే వరసగా సినిమా ఆఫర్లుతెచ్చుకున్నాడు. సమ్మతమే, నేను మీకు బాగా కావల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ అనే క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం.

Young Heroes : ‘తగ్గేదేలే’ అంటున్న టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోస్..

మిడిల్ క్లాస్ మెలొడీస్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన ఆనంద్ దేవరకొండ పుష్పకవిమానం సినిమాతో డిసప్పాయింట్ చేశాడు. అయినా ఆఫర్ల కోసం వెయిట్ చెయ్యకుండానే వరసగా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి చిన్న దేవరకొండకు. హైవే, బేబీ సినిమా షూట్స్ తో బిజీగా ఉన్న ఆనంద్.. లేటెస్ట్ గా గంగంగణేశా అనే మరో కొత్త సినిమాని అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశారు ఆనంద్.

Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!

అసలు హిట్ అన్న మాట విని కొన్ని సంవత్సరాలు అయినా కానీ..ఇంకా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆదిసాయికుమార్. ఈమధ్య కాలంలో హిట్ లేని ఏ హీరోకూ లేనన్ని సినిమాలతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు ఆది. లాస్ట్ ఇయర్ శశి, ఈ సంవత్సరం అతిధి దేవో భవ సినిమాలతో ఫ్లాప్స్ ఫేస్ చేసిన ఆది.. ప్రజెంట్ జంగిల్, కిరాతక, సిఎస్ఐ సనాతన్, బ్లాక్..ఇలా 4,5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

పూరీ జగన్ కొడుకు ఆకాష్ పూరీ కూడా కెరీర్ లో పెద్ద హిట్ కొట్టలేదు. అయినా సక్సెస్ కోసం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. రొమాంటిక్ టైటిల్ తో తెరకెక్కిన గత సినిమాకు ప్రభాస్ తో ప్రమోషన్లు చేయించినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా ఏమాత్రం తగ్గకుండా మరో సినిమా రిలీజ్ కు రెడీ అయ్యాడు. జార్జి రెడ్డి డైరెక్టర్ జీవన్ రెడ్డి డైరెక్షన్లో చోర్ బజార్ అనే మరో ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ తో తన లక్ చెక్ చేస్కోబోతున్నాడు.

Young Villains : హీరోలే విలన్లు.. డిమాండ్ మామూలుగా లేదుగా..

హీరో కమ్ విలన్ గా ఈమధ్య స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. నిర్మలా కాన్వెంట్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో పెళ్లి సందడితో మరోసారి తన లక్ చెక్ చేసుకున్నాడు. కమర్షియల్ ఫ్యామిలీ లవ్ స్టోరీగా తెరకెక్కిన పెళ్లి సందడి అనుకున్నంత సక్సెస్ కాకపోయినా.. లేటెస్ట్ గా వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్లో సినిమా అనౌన్స్ చేశారు. ప్రదీప్ అద్వైతం డైరెక్టర్ గా ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది.

2022 Telugu Films: వేల కోట్ల తెలుగు సినిమా.. వచ్చే ఏడాదే టార్గెట్!

కీరవాణి కొడుకు శ్రీసింహ హీరోగా మత్తు వదలరా, తెల్లవారితే గురువారం సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. అంతగా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాయి. ఆ సినిమాలు సక్సెస్ కాకపోయినా మళ్లీ కొంత గ్యాప్ తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేశాడు సింహ. సురేష్ ప్రొడక్షన్స్ లో దొంగలున్నారు జాగ్రత్త అనే క్రేజీ కంటెంట్ తో కొత్తసినిమా మేకింగ్ లో బిజీగా ఉన్నాడు సింహ.