బాండ్ సినిమాకు కరోనా కష్టాలు..

సినిమా పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్ - జేమ్స్ బాండ్ సినిమా ఏడునెలలు విడుదల వాయిదా..

  • Published By: sekhar ,Published On : March 5, 2020 / 10:43 AM IST
బాండ్ సినిమాకు కరోనా కష్టాలు..

సినిమా పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్ – జేమ్స్ బాండ్ సినిమా ఏడునెలలు విడుదల వాయిదా..

కరోనా వైరస్ (కోవిడ్-19) ఎఫెక్ట్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ ఎఫెక్ట్ సినిమా పరిశ్రమపై కూడా పడింది. వరల్డ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకున్నారు. కట్ చేస్తే కరోనా దెబ్బకు ఏకంగా ఏడు నెలలు వాయిదా వేశారు.

వెండితెరపై రా ఏజెంట్‌గా ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టుపెట్టే బాండ్‌కు కరోనా కష్టాలు తప్పలేదు. కరోనా ఎఫెక్ట్ వలన ఇప్పటికే పలు సినిమాల షూటింగులు, రిలీజులు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బాండ్ చిత్రం పది  భాషల్లో విడుదల కానుండడం, కరోనా వైరస్ ప్రభావం కలెక్షన్లపై పడబోతుందనే ఆందోళనతో విడుదల వాయిదా వేశారు నిర్మాతలు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి నవంబర్ 25న ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. (నిఖిల్‌పై అల్లు అర్హ క్లాప్ – 18 పేజీస్ ప్రారంభం)

 బాండ్ సిరీస్‌లోని గత సినిమాల మాదిరిగానే మంచి థ్రిల్లింగ్ యాక్షన్ అడ్వెంచరస్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో డానియల్ క్రెయిగ్ బాండ్ పాత్రలో కనిపిస్తారు. ఇదివరకు ‘క్యాసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, ‘స్కై ఫాల్’, ‘స్పెక్ట్రీ’ సినిమాల్లో కూడా ఆయన బాండ్ పాత్రలో నటించి మెప్పించారు.

No Time To Die which is scheduled to release in April has been pushed to November

మైఖేల్ జి విల్సన్, బార్బరా బ్రొకోలి నిర్మాతలుగా మెట్రో గోల్డ్ విన్ మేయర్ ఇయాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్యారీ జోజి ఫ్యూకునాగా దర్శకత్వం వహిస్తున్నారు. రమి మాలెక్, రాల్ఫ్ ఫెన్నెస్, నయోమి హారిస్, రోరి కిన్నియెర్, లియా సెడౌక్స్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.