Bigg Boss 5: వైవిధ్యంగా సాగిన నామినేషన్స్.. ఈ వారం లిస్ట్‌లో ఐదుగురు!

బిగ్ బాస్ ఇంట్లో సండే అంటే కాస్త ఫన్ డే.. ఇంకాస్త ఎలిమినేషన్స్ ఎమోషన్స్ కలిసి రసవత్తరంగా సాగితే.. మండే ఇక ఎలిమినేషన్స్ నామినేషన్స్ తో నిజంగానే హౌస్ అంతా కంటెస్టెంట్ల ఆగ్రహాంతో..

Bigg Boss 5: వైవిధ్యంగా సాగిన నామినేషన్స్.. ఈ వారం లిస్ట్‌లో ఐదుగురు!

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ ఇంట్లో సండే అంటే కాస్త ఫన్ డే.. ఇంకాస్త ఎలిమినేషన్స్ ఎమోషన్స్ కలిసి రసవత్తరంగా సాగితే.. మండే ఇక ఎలిమినేషన్స్ నామినేషన్స్ తో నిజంగానే హౌస్ అంతా కంటెస్టెంట్ల ఆగ్రహాంతో మండిపోతుంటుంది. యధావిధిగా ఈ సోమవారం కూడా బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. అయితే.. ఈసారి షో నిర్వాహకులు ఈ నామినేషన్స్ ప్రక్రియను కాస్త డిఫరెంట్ గా మార్చేసి మరి కాస్త ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఇది కంటెస్టెంట్ల మధ్య వాడీవేడీ వాదనలకు దారితీసింది.

Bigg Boss 5: వచ్చేవారం ఇంట్లో కొత్త కంటెస్టెంట్లు.. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ ఏంటి?!

‌తొమ్మిది‌ ‌వారాలు‌ ‌పూర్తి‌ ‌చేసుకుని‌ ‌10వ‌ ‌వారం‌ లోకి‌ ‌ఎంటర్‌ ‌అయిన‌ బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ‌ఇక‌ ‌ఈ‌ ‌వారానికి‌ ‌గాను‌ ‌నామినేషన్‌ ‌ప్రక్రియ‌ ‌కూడా ముగిసింది.‌ ‌సోమవారం‌ ‌జరిగిన‌ ‌నామినేషన్స్‌ ‌ప్రక్రియలో‌ ఇంట్లో మిగిలిన పదిమంది కంటెస్టెంట్లలో ‌ఐదుగురు‌ ‌నామినేషన్స్‌ ‌లో‌ ‌నిలవగా ఇందుకోసం ఈసారి బిగ్ బాస్ ప్లాన్ పూర్తి వైవిధ్యంగా సాగింది. హౌస్ కెప్టెన్ నలుగురిని డైరెక్ట్ నామినేట్ చేసి జైల్లో పెడితే.. బయట ఉండే మిగిలిన కంటెస్టెంట్స్ బజర్‌ మోగిన వెంటనే లివింగ్‌ రూమ్‌లో ఉన్న తాళాలతో జైల్లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసుకోవచ్చు.

Bigg Boss Swetha : లక్ష రూపాయలిచ్చి నన్ను కమిట్‌మెంట్ అడిగారు : బిగ్ బాస్ శ్వేత

అలా మొదలైన నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్ కెప్టెన్‌గా ఉన్న అనీ మాస్ట‌ర్‌ ముందుగా కాజల్‌ని, ఆ తరువాత సన్నీ.. మానస్, షణ్ముఖ్‌లను నామినేట్ చేసింది. ఇక బ‌జ‌ర్ మోగిన వెంట‌నే పింకీ ప‌రుగున వెళ్లి లోప‌ల ఉన్న సంకెళ్ల‌ను చేజిక్కించుకుని మాన‌స్‌ని బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. అలా ఒకరి తర్వాత ఒకరు ఈ నామినేషన్ల ప్రక్రియలో పోటాపోటీగా ఆడితే చివరికి షణ్ముఖ్ పింకీని నామినేట్ చేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి షణ్ముఖ్ కూడా అది నా ఇష్టం అంటూ వాదనకు దిగడంతో కాసేపు మాటల యుద్ధం నడిచింది.