MAA Election: ఆగని ‘మా’ వివాదం.. ఎన్నికల అధికారిపై అనుమానాలు!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ముగిశాయి. 'మా' నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతల స్వీకరణతో పాటు ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. కానీ.. ఎన్నికల వివాదం మాత్రం..

MAA Election: ఆగని ‘మా’ వివాదం.. ఎన్నికల అధికారిపై అనుమానాలు!

Maa Election

MAA Election: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ముగిశాయి. ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతల స్వీకరణతో పాటు ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. కానీ.. ఎన్నికల వివాదం మాత్రం ఆగడం లేదు. ఈ ఎన్నికలకు ముందు ఎంత వాడీవేడీగా.. ట్విస్టుల మీద ట్విస్టుల టర్న్స్ ఉన్నాయో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా అంతే టర్న్స్ తీసుకుంటూ అదే వేడి కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలకి.. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి మధ్య ఓడిన ప్రకాష్ రాజ్ మాకు రాజీనామాతో పాటు ఏకంగా తన ప్యానల్ 11 మంది రాజీనామా చేయడంతో ఈ వివాదం కీలక మలుపు తీసుకుంది.

MAA Election: సభ్యత్వానికి రాజీనామా.. ‘మా’లో ఎందుకింత వైరాగ్యం

అయితే, ఇవేమీ లెక్కచేయని విష్ణు ప్రమాణ స్వీకారం కూడా చేసేయగా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ మాత్రం ఎన్నికల రోజు వివాదాలు.. ఎన్నికల తీరు.. ఎన్నికల అధికారి ప్రవర్తన, విధుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు, కోర్టుల వరకు ఈ అంశాన్ని తీసుకెళ్తున్నారు. దీంతో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోనని ఆసక్తిగా మారింది. తాజాగా ఎన్నికలపై తనకు అనుమానాలున్నాయంటూ ప్రకాష్‌ రాజ్‌.. ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని సిసిటివి ఫుటేజ్‌లు పరిశీలించేందుకు వెళ్లారు. ఆయనతో తన ప్యానల్ అభ్యర్థిగా పోటీచేసిన నటుడు తనీష్‌ కూడా వెళ్ళాడు.

MAA Election: ప్రకాష్ రాజ్ అంటే అంత చులకనా.. ప్రలోభాలకు గురి కావద్దు!

ఎన్నికల సెంటర్ వద్దకు పోలీసుల సమక్షంలో వెళ్లిన ప్రకాష్ రాజ్ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ ఫుటేజ్‌ పరిశీలనకు రెండు ప్యానళ్లను పిలిచినప్పటికీ గెలిచిన విష్ణు ప్యానల్‌ ప్రస్తుతం తిరుపతి దేవస్థానం పర్యటనలో ఉండటంతో అందుబాటులో ఎన్నికల సెంటర్ కు వెళ్ళలేదు. విష్ణు ప్యానల్ రాకపోవడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ ను వాయిదా వేసుకోవాలని కోరిన ఎన్నికల అధికారిని కోరినా ఆయన మాట వినలేదని తెలుస్తుంది. ఒక్క ప్యానల్ తో వెళ్లడం కుదరదని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఎన్నికల కేంద్రానికి సీసీటీవీ ఫుటేజ్ చూసేందుకు వెళ్ళలేదు.

Squid Game: రికార్డ్స్ బద్దలు కొడుతున్న స్క్విడ్ గేమ్.. ఎందుకింత క్రేజ్?

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారిపై అనుమానాలు.. ఆరోపణలు కురిపించారు. సమస్యంతా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌తోనని, ఎన్నికల సమయంలోను, ఓట్ల లెక్కింపు సమయంలోను అవకతవకలు జరిగాయని, సీసీటీవి ఫుటేజ్‌లు చూడాలని తాను లేఖ రాసినా ఎన్నికల అధికారి స్పందించలేదన్నారు. దీనిపై స్పందించిన కృష్ణమోహన్‌ ఎన్నికలు పూర్తయిన తర్వాత తనకు బాధ్యత వుండదని, ప్రకాష్‌ రాజ్‌ డిమాండ్‌తో కానీ.. సీసీటీవీ ఫుటేజ్ తో కానీ తనకు సంబంధం లేదన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ అవసరమైతే కోర్టుకు వెళ్లవచ్చునని, కోర్టు తీర్పునుబట్టి స్పందిస్తానని ఎన్నికల అధికారి అంటున్నారు. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో!