Antim: ఆగని నిరసన.. ట్విట్టర్‌లో ‘బాయ్‌కాట్ అంతిమ్’ ట్రెండింగ్!

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు నిరసన సెగ తప్పడం లేదు. అప్పుడెప్పుడో బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత సల్మాన్ సహా చాలా మంది నటీనటులను ఉత్తరాది ప్రేక్షకులు..

Antim: ఆగని నిరసన.. ట్విట్టర్‌లో ‘బాయ్‌కాట్ అంతిమ్’ ట్రెండింగ్!

Antim

Antim: కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు నిరసన సెగ తప్పడం లేదు. అప్పుడెప్పుడో బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత సల్మాన్ సహా చాలా మంది నటీనటులను ఉత్తరాది ప్రేక్షకులు పనిగట్టుకొని వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు నటీనటుల సినిమాలను వ్యతిరేకిస్తూ ప్రచారం హోరెత్తించారు. అప్పటి నుండి సల్మాన్ ప్రతి సినిమా విషయంలో ఈ నిరసన ఎదుర్కొంటూనే ఉన్నాడు. రాధే సినిమాను అసలు థియేటర్లకి రాకుండానే ఓటీటీలోనే విడుదల చేసుకున్నా ఈ నిరసన మాత్రం చూడాల్సి వచ్చింది.

Muddy: దిల్ రాజు చేతికి తెలుగు రైట్స్.. బొమ్మ పక్కా హిట్టా?

కాగా, ఇప్పుడు సల్మాన్, బావ ఆయుష్ శర్మతో కలిసి అంతిమ్ సినిమాను తెచ్చారు. నవంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ చాలాకాలం తర్వాత పోలీస్ పాత్రలో నటిస్తుండడంతో విడుదలకు ముందు అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా విడుదలైన తర్వాత విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుండి కూడా అంతిమ్ మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. అదే సమయంలో ఈ సినిమాను వ్యతిరేకించాలని సోషల్ మీడియాలో ఘోరంగా ప్రచారం జరుగుతుంది.

Disha Patani: అందమైన ముఖాన్ని పాడుచేసుకున్నావా.. దిశాకి ట్రోలింగ్!

ఈ సినిమాపై సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ అంతిమ్’ అని హ్యాష్ ట్యాగ్ తో మొదలైన ప్రచారం ట్రెండింగ్ వరకు వెళ్ళింది. ప్రతీ నిమిషానికి ట్వీట్లు పెరుగుతూనే ఉండగా సల్మాన్ కు దేశం పట్ల శ్రద్ధ లేదనే విధంగా ట్వీట్ల వరద పారుతుంది. నిజానికి ఈ సినిమా విడుదలకి ముందే మొదలైన ఈ ప్రచారం సినిమా విడుదల తర్వాత అంతకంతకు పెరిగి చివరికి బాయ్ కాట్ అంతిమ్ ట్యాగ్ ట్రెండింగ్ వరకు వెళ్ళింది.