Aha: సంక్రాంతి వరకూ నాన్‌స్టాప్ తెలుగు వినోదాల పండుగ!

ఒరిజినల్ తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతుంది. కరోనా లాక్ డౌన్ లో..

Aha: సంక్రాంతి వరకూ నాన్‌స్టాప్ తెలుగు వినోదాల పండుగ!

Aha

Aha: ఒరిజినల్ తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతుంది. కరోనా లాక్ డౌన్ లో ప్రేక్షకులు డిజిటల్ ప్రసారాల వైపు మొగ్గు చూపడం ఎక్కువవడంతో ఆహా కూడా సరికొత్తగా అలరిస్తుంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ఉండే ఆహా ఇప్పుడు దసరాను టార్గెట్ చేసి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

Balakrishna : బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సూపర్ ఛాన్స్ ఇచ్చిన బాలయ్య బాబు

ఆహా వీడియో దసరా పండగ సందర్భంగా మొదలు పెట్టిన నాన్ స్టాప్ వినోదాల పండుగను సంక్రాంతి వరకు కంటిన్యూ చేసేందుకు సిద్ధమైంది. ఇందు కోసం సరికొత్త సినిమాలు, షోలతో స్ట్రాంగ్ లైనప్ తో ఆహా వీడియో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగ వరకూ అదిరిపోయే నాన్ స్టాప్ 100 శాతం తెలుగు వినోదాల పండుగ మీ ఆహాలో సిద్దమా అంటూ ఆహా వీక్షకులను ఊరిస్తుంది.

Chiranjeevi: అభిమానికి అండగా చిరంజీవి.. ఫ్లైట్ టిక్కెట్ వేయించి హైదరాబాద్ రప్పించి!

ఇందుకోసం ఆహా డే బై డే మరింత ఆసక్తికర కంటెంట్ ను సిద్ధం చేసుకుంది. ఆల్రెడీ టాలీవుడ్ లేటెస్ట్ అండ్ రీసెంట్ హిట్స్ ‘లవ్ స్టోరీ’, ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ సినిమాలు అందుబాటులోకి రాగా రానున్న రోజుల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’, ‘గని’, ‘రొమాంటిక్’ అలాగే ‘మంచి రోజులొచ్చాయ్’, ‘అనుభవించు రాజా’ ఇంకా ‘లక్ష్య’ వంటి టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలు కూడా ఆహా నుంచే అందుబాటులోకి రానున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా పండగకి సిద్దమైపొండి.