ప్రియాపై ఫైర్ అవుతున్న లవర్స్ డే హీరోయిన్

ప్రియా వారియర్‌‌పై నూరిన్ షెరీష్ సంచలన వ్యాఖ్యలు..

  • Published By: sekhar ,Published On : February 21, 2019 / 12:08 PM IST
ప్రియాపై ఫైర్ అవుతున్న లవర్స్ డే హీరోయిన్

ప్రియా వారియర్‌‌పై నూరిన్ షెరీష్ సంచలన వ్యాఖ్యలు..

ప్రియా వారియర్‌.. ఒరు ఆధార్ లవ్ అనే మలయాళ సినిమాలో, కుర్రాళ్ళకి కొంటెగా కన్ను గీటిన ఒకే ఒక్క షాట్‌తో, నేషనల్ లెవల్లో పాపులర్ అయిపోయింది. మలయాళం పరిస్థితి ఏమోకానీ, తెలుగులో సినిమా తేలిపోయింది. పది నిమిషాల క్లైమాక్స్‌ని రీ షూట్ చేసి, యాడ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా చేసిన నూరిన్ షెరీష్, రీసెంట్‌గా ప్రియా వారియర్‌పై నిప్పులు చెరిగింది. ఒరు ఆధార్ లవ్ కోసం, డైరెక్టర్ ఒమర్ లులు.. నూరిన్ షెరీఫ్, రోషన్ అబ్దుల్ ఇద్దరిని హీరో, హీరోయిన్లుగా ఫిక్స్ చేసాడు. ఎప్పుడైతే, ప్రియ కన్ను గీటే సీన్ రిలీజ్ అయ్యి, వైరల్ అయ్యిందో అప్పటికప్పుడు, నూరిన్ క్యారెక్టర్ డ్యూరేషన్ తగ్గించేసి, ప్రియా క్యారెక్టర్ లెంగ్త్ పెంచారని, ప్రియ వల్లే తను సెకండ్ హీరోయిన్ అయిపోయానని నూరిన్ ఆవేదన వ్యక్తం చేసింది.

రోషన్‌‌తో కలిసి మళ్ళీ నటించాలని ఉందని కూడా చెప్పింది. అయితే, ప్రియా వారియర్‌తో కలిసి నటిస్తారా? అని అడిగితే.. నో కామెంట్స్.. అని మాట దాటేసింది నూరిన్.. ఈమె వ్యాఖ్యలపై ప్రియా వారియర్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి.

వాచ్ ఫ్రీక్ పిల్లా వీడియో సాంగ్…
 

Read Also:దేశం అంటే ఇదే : రూ.6 లక్షల బిక్షాటన డబ్బు.. అమర జవాన్లకు
Read Also:ప్రియాపై ఫైర్ అవుతున్న లవర్స్ డే హీరోయిన్
Read Also:ఇప్పుడు చేయండి చీటింగ్: ఎగ్జామ్ సెంటర్స్ లో షూస్ బ్యాన్