Nora Fatehi : వివాదంలో చిక్కుకున్న బాహుబలి మనోహరి..

నోరా ఫతేహి.. బాలీవుడ్ సినిమాలతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. టాలీవుడ్ కి ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అంటూ ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోవడంతో, సౌత్ లో ఐటమ్ గర్ల్ గా ఫస్ట్ ఛాయస్ అయ్యిపోయింది. ఆ తరువాత కూడా పలు సినిమాలో స్పెషల్ సాంగ్ తో మెప్పించిన ఈ ఐటమ్ గర్ల్.. ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఖతార్‌లో జరుగుతున్న...

Nora Fatehi : వివాదంలో చిక్కుకున్న బాహుబలి మనోహరి..

Nora Fatehi embroiled in controversy

Nora Fatehi : నోరా ఫతేహి.. బాలీవుడ్ సినిమాలతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. టాలీవుడ్ కి ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అంటూ ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోవడంతో, సౌత్ లో ఐటమ్ గర్ల్ గా ఫస్ట్ ఛాయస్ అయ్యిపోయింది. ఆ తరువాత రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ సాంగ్, ఈ అమ్మడికి మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టింది.

Adivi Sesh: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సినిమాలకు నో చెప్పాడట!

ఆ తరువాత కూడా పలు సినిమాలో స్పెషల్ సాంగ్ తో మెప్పించిన ఈ ఐటమ్ గర్ల్.. ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్‌ వేదికపై నోరా ఫతేహి భారతీయ జెండాను అగౌరవ పరిచింది అంటూ నెటిజెన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఫిఫా ఫ్యాన్ ఫెస్ట్‌లో నోరా డాన్స్ షో ఇచ్చింది. ఈ క్రమంలో ఒక అభిమాని నోరా చేతికి ఇండియన్ ఫ్లాగ్ ని అందించాడు.

మొదట ఆమె భారత జెండాను ఫిఫా వేదికపై రెపరెపలాడించినందుకు నెటిజెన్లు నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత, నోరా భారత జెండాను తలకిందులుగా పట్టుకున్నందుకు ఆమెను సోషల్ మీడియా వేదికా ట్రోల్ చేస్తున్నారు. నోరా భారత జెండాని అగౌరవపరిచింది అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.