Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!

బాలయ్య బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ మూవీని హిందీలో రిలీజ్ చెయ్యాలంటూ నార్త్ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు..

Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!

Akhanda Movie

Akhanda: బాలయ్య బొమ్మ కోసం బాలీవుడ్ ఎదురు చూస్తుంది.. బ్లాక్ బస్టర్ ‘అఖండ’ మూవీని హిందీలో రిలీజ్ చెయ్యాలంటూ నార్త్ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ‘‘అఖండ’ మూవీ.. ప్రౌడ్ ఫర్ సనాతన్ ధర్మ’’ అంటూ హిందీ వెర్షన్ రిలీజ్ చెయ్యాలని కోరుతున్నారు.

Akhanda : 20 ఏళ్ల తర్వాత క్రాస్ రోడ్స్‌లో కోటి కొల్లగొట్టిన బాలయ్య!

దీని కోసం ఈ #WeWantAKHANDAInHindi హ్యాష్ ట్యాగ్ వాడాలంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకుముందు బాలయ్య సినిమాలు కొన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టాయి. ఇప్పుడు నార్త్ ప్రేక్షకులు ‘అఖండ’ చిత్రాన్ని హిందీలో చూడాలనుకుంటున్నారు. త్వరలో హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

Hyderabad Traffic Police : ‘అఖండ’ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. బాలయ్యకి థ్యాంక్స్!

బాలయ్య-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ ఎవరూ ఊహించని వండర్స్ క్రియేట్ చేసింది. నటసింహ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ దాదాపు మర్చిపోయిన 50 రోజుల పోస్టర్‌ను మళ్లీ ప్రేక్షకాభిమానులకు చూపించింది ‘అఖండ’.

Akhanda : వన్స్ స్టెప్ ఇన్.. ఓటీటీలో ‘అఖండ’ ఆల్ టైమ్ రికార్డ్!

ఇటీవలే 103 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జనవరి 21 సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్స్ స్టార్ట్ చేస్తే 24 గంటల్లో పది లక్షల స్ట్రీమింగ్స్ సాధించి డిజిటల్ రంగంలో రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు హిందీలో రిలీజ్ చేస్తే నార్త్‌లో కూడా సత్తా చాటడం పక్కా అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..