Liger: ఒక్క వీడియో రాలేదు.. కానీ పీక్స్‌కి చేరిన అంచనాలు!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా మీద రోజురోజుకీ హైప్స్ పెంచేస్తున్నారు. టాలీవుడ్ హీరో సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ యాడ్ అయినప్పుడే సినిమా వేరే లెవల్..

Liger: ఒక్క వీడియో రాలేదు.. కానీ పీక్స్‌కి చేరిన అంచనాలు!

Liger

Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా మీద రోజురోజుకీ హైప్స్ పెంచేస్తున్నారు. టాలీవుడ్ హీరో సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ యాడ్ అయినప్పుడే సినిమా వేరే లెవల్ అనకున్నారు అందరూ. వీటికి తోడు మైక్ టైసన్ రావడంతో ఈ హైప్ ఇంకాస్త పెరిగింది. లేటెస్ట్ గా విజయ్ లైగర్ మీద దర్శకుడు పూరి జగన్నాధ్ చేసిన కామెంట్స్ తో సినిమా వేరే లెవల్ అనుకుంటున్నారు అందరూ.

Uppena 2: ఉప్పెనకి సీక్వెల్.. పాన్ వరల్డ్ కథంటున్న బుచ్చిబాబు

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఎంత లేటవుతున్నా.. సినిమా మీద ఆడియన్స్ లో క్రేజ్, ఎక్స్ పెక్టేషన్స్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు లైగర్ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్ డైరెక్షన్లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తెలుగు ఎంట్రీ ఇస్తున్న ఈ సూపర్ క్రేజీ సినిమా మీద ఆడియన్స్ లో ఉన్న హైప్స్ ని ఇంకాస్త పీక్స్ కి తీసుకెళ్లాడు విజయ్ దేవరకొండ.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

రెండేళ్ల నుంచి కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ జాయింట్ గా తెరకెక్కిస్తున్న ఈ లైగర్ మూవీ సెట్స్ మీద ఉండగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా నుంచి అఫీషియల్ గా ఏం వీడియో రిలీజ్ కాకుండానే.. జస్ట్ మాటలతోనే సినిమా మీద హైప్స్ పెంచేస్తున్నారు విజయ్. సినిమా పిచ్చెక్కిస్తుంది గ్యారంటీ అంటూనే.. 2022లో ఇండియా మొత్తం లైగర్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటూ ఎక్స్ పెక్టేషన్స్ ని పీక్స్ కి పెంచేశారు విజయ్ దేవరకొండ.

Rashmika: రష్మికకి కోపమొస్తే ఇలా చూపిస్తుందా..? వీడియో వైరల్!

మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా బాలీవుడ్ ప్రొడ్యూసర్లే కాకుండా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ యాడ్ అవ్వడంతో సినిమా రేంజ్ ఇంకా పెరిగిపోయింది. అప్పుడెప్పుడో లైగర్ ని 200కోట్లకు ఓటీటీలో సేల్ చేసినట్టు న్యూస్ వైరల్ అయితే విజయ్ మాత్రం.. అబ్బే ఇంత తక్కువా, అసలు 200కోట్లు ఒక కలెక్షనా.. థియేటర్లో అంతకుమించి రికార్డులు, కలెక్షన్లు ఉంటాయని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. వీటన్నింటినీ చూస్తే.. సినిమా వేరే లెవల్ లో ఉండడం గ్యారంటీ అని మేకర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ గా ఫిక్స్ అయిపోయారు.