Pushpa: తగ్గేదేలే.. ఒక్కరు కాదు ఇద్దరు ఐటెం బాంబ్స్!

అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుండి ఐకానిక్ స్టార్ గా మార్చేసిన పుష్ప కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అందుకే 'పుష్ప' మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.

10TV Telugu News

Pushpa: అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుండి ఐకానిక్ స్టార్ గా మార్చేసిన పుష్ప కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ‘పుష్ప’ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ మేరకు భారీ తారాగణంతో పుష్ప రాజ్‌ని థియేటర్లలోకి దించుతున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందనేది ప్రత్యేకమైన వివరణ అవసరమే లేదు. అందులో కూడా బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో ఐటెం సాంగ్ అంటే.. స్టెప్పేస్తే ప్రేక్షకలోకం హుషారెత్తివాలి అన్నట్లుగా ఉంటుంది. అందుకే ‘పుష్ప’లో ఐటెం సాంగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో ఏ సినిమాలోనూ చూడని విధంగా పుష్పలో ఈ ఐటెం సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

అందుకే పుష్పలో ఐటెం సాంగ్ ఒకటి కాదు రెండు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక భామగా ఊర్వశి రౌటేలాను దాదాపుగా ఫైనల్ చేశారు. కాగా ఇప్పుడు మరో భామగా సన్నీలియోన్‌ను సంప్రదించారని వినిపిస్తుంది. అయితే ఈ వార్తపై ఇంకా ఎలాంటి అధికారిక అప్ డేట్ అయితే లేదు కానీ దాదాపుగా ఇది నిజమేనని తెలుస్తుంది. అయితే, పుష్పను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. మరి రెండు భాగాలలో రెండు పాటలు పెడతారా లేక ఒకే పార్టులో ఈ స్పెషల్ సాంగ్స్ ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.

10TV Telugu News