Sirivennela : పాటలే కాదు పుస్తకాలు కూడా రచించిన సిరివెన్నెల

సిరివెన్నెల మన అందరికి పాటల రచయితగానే తెలుసు. కానీ ఆయన పుస్తకాలు కూడా రచించారు. ఆ పుస్తకాలకి అవార్డులు కూడా సంపాదించారు. సాహితీలోకంలో తన పుస్తకాలతో చెరగని.......

Sirivennela :  పాటలే కాదు పుస్తకాలు కూడా రచించిన సిరివెన్నెల

Sirivennela Books

Sirivennela : తెలుగు సినీ వినీలాకాశంలో పాటల రచయితగా అగ్ర స్థానంలో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి, సినీ పరిశ్రమకి తీరని లోటు. ఇవాళ అయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు అంతక్రియలు నిర్వహించనున్నారు. సిరివెన్నెల మన అందరికి పాటల రచయితగానే తెలుసు. కానీ ఆయన పుస్తకాలు కూడా రచించారు. ఆ పుస్తకాలకి అవార్డులు కూడా సంపాదించారు.

Sirivennela : ఫిలించాంబర్‌లో సిరివెన్నెల భౌతికకాయం.. తరలివస్తున్న సినీ ప్రముఖులు, అభిమానులు

గేయరచయితగా పాటలు మాత్రమే కాకుండా చక్కటి కథలు, కవిత్వంతో సాహితీలోకంలో తన పుస్తకాలతో చెరగని ముద్రవేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. తన ఇష్టదైవం శివుడిపై భక్తితో ‘శివదర్పణం’ అనే పుస్తకాన్ని రాశారు. తాను రాసిన పాటలు, వాటి వెనక ఉన్న సంఘటనల గురించి చెప్తూ ‘సిరివెన్నెల తరంగాలు’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన రాసిన ‘నంది వర్ధనాలు’ పుస్తకానికి అనేక అవార్డులు వచ్చాయి. పెళ్లి గొప్పతనాన్ని పాటల రూపంలో ఆవిష్కరిస్తూ ఆయన ‘కళ్యాణ రాగాలు’ అనే చక్కటి పుస్తకాన్ని రచించారు. తాను రాసిన కథలను ‘ఎన్నో రంగుల తెల్లకిరణం’ పేరుతో పుస్తకంగా విడుదల చేశారు. క్షీరసాగరమథనం అనే గేయకావ్యం, నాన్న పులి, సన్మానోపనిషత్తు, తాత్విక వ్యాసాలు అనే పుస్తకాల్ని కూడా రచించారు.