Chiru 154: పవన్ కాదు.. రవితేజనే చిరంజీవి తమ్ముడు!

కరోనా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య..

Chiru 154: పవన్ కాదు.. రవితేజనే చిరంజీవి తమ్ముడు!

Chiru 154

Chiru 154: కరోనా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ తో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాను మొదలు పెట్టాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Sobhita Dhulipala: ఓరచూపుతో గాలమేసే తెనాలి బ్యూటీ శోభితా!

ఇప్పటికే ఈ సినిమా నుండి వదిలిన మాస్ లుక్ అభిమానులను ఒక్కసారిగా అలెర్ట్ చేసింది. కాగా, మరోవైపు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అంశం ఒకటి సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోండగా ఇందులో చిరంజీవి పాత్రకి తగ్గట్లే తమ్ముడి పాత్ర ఒకటి ఉందట. సినిమాలో ఈ పాత్ర చాలా బలంగా ఉండడంతో పాటు సినిమాకి చాలా అవసరం కూడా ఉంటుందట. దీంతో ఈ పాత్ర ఎవరు చేయనున్నారన్నది ఆసక్తి కరంగా మారింది.

Bigg Boss 5: ఈ వారం ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఈమెనే?

ముందుగా దర్శకుడు బాబీ ఈ పాత్ర కోసం చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడని ప్రచారం జరిగింది. బాబీతో పవన్ కు మంచి రిలేషన్ ఉండడంతో ఇది నిజం కావచ్చని కూడా అనుకున్నారు. కానీ, ఇప్పుడు కొత్తగా మరో ప్రచారం తెరమీదకొచ్చింది. పవన్‌ ప్లేస్‌లోకి రవితేజ వచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. రవితేజ చిరంజీవికి ఎంత పెద్ద అభిమానో అందరికీ తెలుసు. గతంలో అన్నయ్య సినిమాలో ఓసారి చిరంజీవికి తమ్ముడిగా కనిపించగా.. శంకర్ దాదా జిందాబాద్ లో తళుక్కున మెరిశాడు. ఇక, ఇప్పుడు మరోసారి మల్టీస్టారర్ రేంజ్ పాత్రలో నటించే అవకాశం కనిపిస్తుంది.