Tollywood New Releases: అఖండ ఊపు.. ఇక బాక్సాఫీస్‌పై టాలీవుడ్ యుద్ధమే!

ఇక బాక్సాఫీస్ పై టాలీవుడ్ పెద్ద యుద్ధమే చేయబోతుంది. ఇదీ.. ఇప్పుడీ ఊపు కావాలి టాలీవుడ్ కి. అఖండ ఇచ్చిన బూస్టప్ తో తెలుగు మేకర్స్ కి ఫుల్ ఎనర్జీ వచ్చింది. కొత్త కొవిడ్ వేరియంట్..

Tollywood New Releases: అఖండ ఊపు.. ఇక బాక్సాఫీస్‌పై టాలీవుడ్ యుద్ధమే!

Tollywood New Releases

Tollywood New Releases: ఇక బాక్సాఫీస్ పై టాలీవుడ్ పెద్ద యుద్ధమే చేయబోతుంది. ఇదీ.. ఇప్పుడీ ఊపు కావాలి టాలీవుడ్ కి. అఖండ ఇచ్చిన బూస్టప్ తో తెలుగు మేకర్స్ కి ఫుల్ ఎనర్జీ వచ్చింది. కొత్త కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ సైలెంట్ గా ఉంటే.. టాలీవుడ్ వేల కోట్ల బిజినెస్ తో బరిలోకి దూకుతుంది. అవును తెలుగు సినిమా లెవెల్ రేంజ్ ఏంటన్నది రాబోయే సినిమాలే తేల్చి చెప్పబోతున్నాయి. కొవిడ్ తర్వాత డీలాపడ్డ టైంలోనే పాన్ ఇండియా రేంజ్ ను సెట్ చేసుకుని.. తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా అన్నంతగా మారిపోయింది. ఒక్కో సినిమా కోట్ల నుండి వందల కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తుంది.

Bigg Boss 5: బిగ్ బాస్ తర్వాత ఇంట్లో వినిపించే గొంతు కాజల్‌దే

మరీ ముఖ్యంగా 2022 ఏడాదికి వేల కోట్ల బిజినెస్ లక్ష్యం.. మన మేకర్స్ ముందుంది. అది 2021 ఈ డిసెంబర్ నుంచి అంటే అఖండతోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. దాదాపు 52కోట్ల వరకు ప్రీరిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన అఖండ రాబట్టాల్సింది 60 కోట్లకు పైమాటే. కీర్తి సురేష్ గుడ్ లక్ సఖితో పాటూ నాగశౌర్య లక్ష్యం డిసెంబర్ 10న విడుదలవుతున్నాయి. ఈ రెండూ డీసెంట్‌ బిజినెస్ చేసాయి. ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 17న పుష్పతో బన్నీ రంగంలోకి దిగబోతున్నారు. పుష్ప దాదాపు ఒక్క తెలుగులోనే 100 కోట్ల థియేట్రికల్ డీల్స్ తో రిలీజ్ కాబోతుంది. మిగిలిన లాంగ్వేజెస్ కలుపుకుంటే అది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.

Bollywood Film Release: 6 నెలలు.. 3 వేలకోట్లు.. ఇదీ బాలీవుడ్ టార్గెట్!

నాని కెరీర్ లోనే భారీ బడ్టెట్ దాదాపు 50 కోట్ల ఖర్చుతో రాబోతుంది శ్యామ్ సింగ రాయ్. డిసెంబర్ 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కూడా మంచి థియేట్రికల్ బిజినెస్ చేసింది. తెలుగుతో పాటూ సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలో శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ టైమ్ నాని పెద్ద టార్గెట్ తో థియేటర్స్ కి వస్తున్నాడు. నాన్ థియేట్రికల్ డీల్స్ వదిలేస్తే ఎంత కాదన్నా శ్యామ్ సింగ రాయ్ 50 కోట్ల కలెక్షన్ తెచ్చుకోవాలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

Bigg Boss 5: నో డౌట్ ఈరోజు పింకీ ఎలిమినేషన్ ఖాయం!

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లోనే సుమారు 1200 కోట్లకి పైగా టార్గెట్ చేసింది టాలీవుడ్. అది కూడా.. సోలో హీరోలు కాదు.. మల్టీస్టారర్ మ్యానియాతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. ఇందులో ముందొచ్చేది ఆర్ఆర్ఆర్. జనవరి 7న రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ బిజినెస్ దాదాపు 500 కోట్లు కాగా.. ఇది ఎంత వసూళ్లు రాబడుతుందనేది అంచనాల కందనిది. నార్త్ సపరేట్ గా, సౌత్ లో సపరేట్ గా వందల కోట్లు రాబట్టాలన్నది రాజమౌళి ప్లాన్. ఆ దిశగానే ప్రమోషన్స్ కి టీమ్ ని ప్రిపేర్ చేస్తున్నారు జక్రన్న.

NBK’s Unstoppable: మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్.. బాలయ్య షోలో మహేష్!

జనవరి 12న పవన్ కళ్యాణ్-రానాల భీమ్లా నాయక్ రానుండగా ఇప్పటికే 100 కోట్లకు బిజినెస్ జరిగింది. ఓన్లీ తెలుగు ప్రజల్నే ఎయిమ్ చేసిన భీమ్లా నాయక్ హ్యూజ్ సక్సెస్ సాధించాలంటే పెట్టిన పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్స్ కి రావాల్సిందే. ఆ తర్వాత జనవరి 14న ప్రభాస్ రాధేశ్యామ్ నార్త్ లో భారీ వసూళ్లు రాబట్టాలనే ట్రైల్స్ లో ఉంది. అంతా కలిపి 200కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన రాధేశ్యామ్ అంతకు మించిన టార్గెట్ తో వస్తున్నాడు.

Bheemla Nayak: సినిమా ఇంటెన్సిటీని పెంచేసిన అడవి తల్లి సాంగ్

జనవరి 15న రానున్న నాగార్జున, నాగచైతన్యల బంగార్రాజు ఇప్పటికే 40 కోట్ల బిజినెస్ పూర్తిచేసుకుంది. ఫిబ్రవరి 4న రానున్న చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య సినిమా దాదాపు 120 కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది. చివరిగా ఫిబ్రవరి 25న రానున్న వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 3.. 80 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని అంచనా. ఇలా జస్ట్ 50 రోజుల్లోనే తెలుగు సినిమా వెయ్యి కోట్లను మించిన బిజినెస్ తో మొదలవనుండగా.. ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడతాయి.. అసలు ఈ ఏడాది మన సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనని ఊహించడం కూడా కష్టమే.

UnstoppableShannu: సోషల్ మీడియాలో షన్ను షేక్.. లక్షలకొద్దీ ట్వీట్లు!

ఇవే కాదు మహేష్ సర్కారు వారి పాట.. పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలతో పాటూ చిన్న, పెద్ద సినిమాలు.. ప్రభాస్ పాన్ వరల్డ్ రేంజ్ మూవీస్.. ఇలా అన్ని కలుపుకుంటే వేల కోట్ల సినిమా మార్కెట్ గా టాలీవుడ్ మారనుందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ నెల రిలీజ్ లతో పాటూ ముఖ్యంగా వచ్చే ఏడాది తొలి సినిమాల ఓపెనింగ్ ని బట్టి ఈ ట్రేడ్.. ఎలాంటి సునామీ సృష్టించబోతున్నది తేలిపోతుంది.