NTR30: ఎన్టీఆర్ 30 లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్న సమయంలో కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు తారక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ రావడంతో, ఈ కాంబినేషన్‌లో మరో సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇంకా ఈ సినిమాను పట్టాలెక్కించలేదు.

NTR30: ఎన్టీఆర్ 30 లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్..?

NTR 30 Launch Time Fixed

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్న సమయంలో కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు తారక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ రావడంతో, ఈ కాంబినేషన్‌లో మరో సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇంకా ఈ సినిమాను పట్టాలెక్కించలేదు.

NTR30: తారక్ సినిమాలో జాన్వీ రెమ్యునరేషన్ అంతా..?

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇటీవల ఓ ఈవెంట్‌లో తారక్ ఈ సినిమా లాంచ్ గురించి మట్లాడాడు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు తారక్ తెలిపాడు. అయితే తాజాగా ఈ సినిమా లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మార్చి 15న గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

NTR30: తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్ కాదట!

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మార్చి మూడో వారంలో స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో తారక్ సరసన అందాల భామ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఈ సినిమాను యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఫిలింస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నాయి.