NTR 30 : వస్తున్నా అంటూ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్పెషల్ పోస్ట్ .. మొదలుపెట్టిన ఎన్టీఆర్ 30 షూట్..

ఇటీవల ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు అవ్వగా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తుండగా తాజాగా నేడు ఎన్టీఆర్ సూపర్ అప్డేట్ ఇచ్చారు.

NTR 30 : వస్తున్నా అంటూ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్పెషల్ పోస్ట్ .. మొదలుపెట్టిన ఎన్టీఆర్ 30 షూట్..

NTR 30 movie shoot started NTR posts a pan India special video

NTR 30 :  RRR సినిమా తర్వాత ఎన్టీఆర్(NTR) 30వ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఎదురుచూశారు. మొత్తానికి ఎన్టీఆర్ సినిమా మొదలయింది. ఇటీవలే ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి రాజమౌళి(Rajamouli), ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో పాటు అనేకమంది సినీ ప్రముఖులు విచ్చేశారు. ఈ పూజా కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది.

ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలు అవ్వగా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తుండగా తాజాగా నేడు ఎన్టీఆర్ సూపర్ అప్డేట్ ఇచ్చారు.

Keerthy Suresh : దసరా సక్సెస్ తో కీర్తి సురేష్ ఎలా ఎగురుతుందో చూడండి.. నవ్వాగదు..

ఎన్టీఆర్ ఈ సినిమా సెట్ లోకి అడుగు పెట్టిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీఆర్ సెట్ లోకి అడుగు పెట్టి కొరటాల శివని కలవగా ఇదంతా వెనక నుంచి వీడియో తీసి షూట్ మొదలయింది, వస్తున్నా అంటూ షేర్ చేశారు. ఈ వీడియోని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో షేర్ చేయడం గమనార్హం. దీంతో ఎన్టీఆర్ సెట్లోకి అడుగుపెట్టిన వీడియో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు అప్డేట్ ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలవ్వగా సినిమాని 2024 సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నారు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)