తారక్ 30.. బిగ్ అనౌన్స్‌మెంట్..

  • Published By: sekhar ,Published On : August 31, 2020 / 12:31 PM IST
తారక్ 30.. బిగ్ అనౌన్స్‌మెంట్..

NTR 30 Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదలైంది.



ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ‘RRR’లో నటిస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతోంది. కానీ ఎప్పుడనేది క్లారిటీ లేదు. ఈ సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలని, కనీసం టైటిల్ అయినా రిలీజ్ చేయాలని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా దర్శక నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు.

దీంతో నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న అభిమానులనుంచి.. కొత్త సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇవ్వాలని మెసేజులు వస్తున్నాయి. షూటింగ్ ప్రారంభం కాగానే సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడిస్తాం. టైటిల్ ముందుగా రివీల్ చేయకూడదనే సెంటిమెంట్ మాకు ఉంది. మమ్మల్ని నమ్మండి. త్వరలోనే సినిమాకు సంబంధించి ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాం’ అని నాగవంశీ ట్వీట్ చేశారు. నేడు(ఆగస్టు 31) నిర్మాత రాధాకృష్ణ(చినబాబు) పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేశారు నాగవంశీ.